స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసులు
- April 02, 2025
న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ నుంచి ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీకి నోటీసులు అందాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఫీజుకు సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉందంటూ ఈ నోటీసులు వచ్చాయి.ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. మొత్తం రూ.158.25 కోట్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు వచ్చినట్లు పేర్కొంది.
తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్యకాలంలో డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ బకాయిలు రూ.158.27 కోట్లుగా పేర్కొంటూ తమకు నోటీసులు అందాయంటూ స్విగ్గీ పేర్కొంది. అయితే దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేయనున్నట్లు తెలిపింది. ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన ఆదేశాలు తమ ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ షేర్లు రాణిస్తున్నాయి. 10:40 గంటల సమయంలో షేర్లు 2.80 శాతం లాభంతో రూ.340.85 వద్ద ట్రేడవుతున్నాయి. కాగా, స్విగ్గీకి గతంలోనూ ఇలాంటి జీఎస్టీ బకాయిలకు సంబంధించిన నోటీసులు జారీ అయిన విషయం గమనార్హం.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







