CBSE 12వ తరగతి పరీక్షలు ముగింపు..ఫలితాలు ఎప్పుడంటే?

- April 07, 2025 , by Maagulf
CBSE 12వ తరగతి పరీక్షలు ముగింపు..ఫలితాలు ఎప్పుడంటే?

మస్కట్: ఒమన్‌లో నివసిస్తున్న వందలాది మంది భారతీయ విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇండియన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షలను పూర్తి చేశారు.  ఈ సంవత్సరం పరీక్షలు సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్ విభాగాలలో 120 కంటే ఎక్కువ సబ్జెక్టులను కవర్ చేశాయి.  

ఈ సంవత్సరం CBSE ప్రశ్నాపత్రం రూపకల్పనలో అప్డేట్ చేశారు. జాతీయ విద్యా విధానం (NEP) 2020 కి అనుగుణంగా యోగ్యతా ఆధారిత ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. బట్టీ పట్టడంపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులను అమల్లోకి తెచ్చారు. 

ఇక పరీక్షలు పూర్తయినందున, బోర్డు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించాలని భావిస్తున్నది. ఫలితాల ప్రకటనలకు సంబంధించిన విద్యార్థులు అధికారిక CBSE వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఫలితాలు మే నెలలో వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com