24 ఏళ్ల తర్వాత వరించిన అదృష్టం.. భారతీయ ప్రవాసికి $1 మిలియన్..!!

- May 15, 2025 , by Maagulf
24 ఏళ్ల  తర్వాత వరించిన అదృష్టం.. భారతీయ ప్రవాసికి $1 మిలియన్..!!

దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో  $1 మిలియన్ విజేతల జాబితాలో మరో భారతీయుడు చేరాడు.  69 ఏళ్ల దుబాయ్ ప్రవాసికి చెందిన మదతిల్ మోహన్‌దాస్..  ఏప్రిల్ 28న టెర్మినల్ 3 అరైవల్ షాపులో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0310తో సిరీస్ 501లో మిలియనీర్ అయ్యారు.

మోహన్‌దాస్ 24 సంవత్సరాలుగా డ్యూటీ ఫ్రీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు. అతను ఇద్దరు పిల్లల తండ్రి. అల్ జాబర్ గ్యాలరీకి పర్చెస్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. “దుబాయ్ డ్యూటీ ఫ్రీకి చాలా ధన్యవాదాలు. ఈ విజయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను.” అని ఆయన అన్నారు.

కేరళకు చెందిన మోహన్‌దాస్, 1999 నుండి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో $1 మిలియన్ గెలుచుకున్న 250వ భారతీయుడిగా నిలిచాడు. డ్రా తర్వాత, మిలీనియం మిలియనీర్ సిరీస్ 500 విజేతకు ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అజ్మాన్‌లో ఉన్న మరో భారతీయుడు వేణుగోపాల్ ముల్లచ్చేరి $1 మిలియన్ గెలుచుకున్న 500వ విజేత అయ్యాడు. ప్రెజెంటేషన్ తర్వాత రెండు లగ్జరీ కార్లు , మోటార్‌బైక్‌ల కోసం సర్ ప్రైజ్ డ్రా నిర్వహించారు.

దుబాయ్‌లో నివసిస్తున్న 48 ఏళ్ల జర్మన్ వ్యక్తి బిషర్ షిబ్లాక్.. టికెట్ నంబర్ 1185 తో BMW 740i M స్పోర్ట్ (ఆక్సైడ్ గ్రే మెటాలిక్) కారును గెలుచుకున్నాడు.  దానిని అతను మే 3న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. అతను సెప్టెంబర్ 2023లో సైతం మెర్సిడెస్ బెంజ్ S500 కారును గెలుచుకున్నాడు.  16 సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్న షిబ్లాక్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. యు 9 సంవత్సరాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ప్రమోషన్‌లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. “నా లక్కీ నంబర్ '18'తో నేను మళ్ళీ గెలిచినందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. సంతోషంగా ఉన్నాను. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు!” అని ఆయన అన్నారు.

యూఏఈలో నివసిస్తున్న అమెరికన్ ఫ్రెసెవ్రా ఫెస్సేహా యోహన్నెస్, టికెట్ నంబర్ 1470 తో మెర్సిడెస్ బెంజ్ G 63 (అబ్సిడియన్ బ్లాక్) కారును గెలుచుకున్నాడు. దీనిని అతను మే 5న కాన్‌కోర్స్ A లో కొనుగోలు చేశాడు.  

షార్జాలో నివసిస్తున్న 18 ఏళ్ల భారతీయ యువతి తస్నిమ్ అస్లాం షేక్ ఏప్రిల్ 22న టెర్మినల్ 1 పబ్లిక్ షాప్‌లో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0330 కలిగిన BMW F 900 R (రేసింగ్ బ్లూ మెటాలిక్) మోటార్‌బైక్‌ను గెలుచుకుంది.   

యూఏఈలో నివసిస్తున్న సౌదీ అరేబియా జాతీయుడు హషీమ్ హషీమ్ సయీద్.. మే 2న కాన్‌కోర్స్ Aలో కొనుగోలు చేసిన టికెట్ నంబర్ 0980 కలిగిన అప్రిలియా టువోనో V4 1100 (టార్క్ రెడ్) మోటార్‌బైక్‌ను గెలుచుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com