కేంబ్రిడ్జ్ పార్క్‌లో సౌదీ విద్యార్థి పై కత్తిపోట్లు, మృతి..!!
- August 04, 2025
మనామా: శుక్రవారం రాత్రి కేంబ్రిడ్జ్కు దక్షిణంగా ఉన్న ఒక పార్కులో కత్తిపోట్లకు గురై సౌదీ యువ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు నిర్ధారించారు. బాధితుడు మొహమ్మద్ యూసఫ్ అల్ ఖాసిమ్ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తన నివాసానికి తిరిగి వెళుతుండగా దాడి జరిగిందన్నారు. అతని మెడకు తీవ్ర గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మరణించాడని తెలిపారు.
కేంబ్రిడ్జ్‌లోని EF ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ స్కూల్ ఈ విషాదంపై తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. "శుక్రవారం సాయంత్రం మా విద్యార్థుల్లో ఒకరు విషాదకర రీతిలో మరణించాడు. దీనికి మేము చాలా బాధపడ్డాము" అని పాఠశాల తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి కేంబ్రిడ్జ్‌షైర్ పోలీసులు 21, 50 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైనా తమను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







