కువైట్లో 5.6% తగ్గిన డొమెస్టిక్ వర్కర్స్..!!
- August 04, 2025
కువైట్: 2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి కువైట్లోని మొత్తం ప్రవాస కార్మికులలో డొమెస్టిక్ కార్మికులు మొత్తం 745,000 (25.2 శాతం) ఉన్నారు. 2024 మొదటి త్రైమాసికం ముగింపుతో పోలిస్తే ఇది 5.6 శాతం తగ్గుదల అని అల్షాల్ నివేదిక తెలిపింది.డొమెస్టిక్ కార్మికులలో దాదాపు 415,000 మంది మహిళలు, 330,000 మంది పురుషులు ఉన్నారు. తొలిస్థానంలో 131,000 మంది ఫిలిప్పీన్స్ మహిళా వర్కర్స్ ఉన్నారు.గత సంవత్సరం వీరి సంఖ్య 175,000 గా ఉంది.
2024 మొదటి త్రైమాసికంలో 248,000 మంది కార్మికులతో భారతీయ మేల్ డొమెస్టిక్ వర్కర్స్ ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నారు.భారతదేశం మొత్తం డొమెస్టిక్ కార్మికులలో అత్యధికంగా 42.2 శాతం వాటాను కలిగి ఉంది.తరువాత శ్రీలంక, ఫిలిప్పీన్స్ ఒక్కొక్కటి 17.9 శాతంతో ఉన్నాయి. బంగ్లాదేశ్తో కలిపి, ఈ నాలుగు దేశాల వారు కువైట్లోని మొత్తం డొమెస్టిక్ వర్క్ పోర్సులో 89.6 శాతం ఉన్నారని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







