సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో 911కు ఎమర్జెన్సీ కాల్స్..!!
- August 05, 2025
రియాద్: సౌదీ అరేబియా జాతీయ భద్రతా కార్యకలాపాల కేంద్రం (911) జూలై నెలలో రికార్డు స్థాయిలో 2.7 మిలియన్లకు పైగా ఎమర్జెన్సీ కాల్స్ ను స్వీకరించింది. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో మొత్తం 2,779,711 కాల్స్ వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలో యూనిఫైడ్ నెంబర్ 911 కేంద్రాలు అధునాతన ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించి పనిచేస్తాయన్నారు. 24 గంటలూ ఖచ్చితమైన సేవలను అందించే అత్యంత శిక్షణ పొందిన సిబ్బంది ఉంటారని తెలిపారు.
మక్కా ప్రావిన్స్ 845,165 కాల్స్ తో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో 243,816 కాల్స్ తో మదీనా, 1,164,066 కాల్స్ తో రియాద్, 526,664 కాల్స్ తో తూర్పు ప్రావిన్స్ ఉన్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రజా భద్రతను బలోపేతం చేయడంలో, వివిధ ఏజెన్సీల మధ్య వేగవంతమైన అత్యవసర ప్రతిస్పందన మరియు సమన్వయాన్ని కల్పించడంలో 911 ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







