విజయవాడలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త యాప్
- August 05, 2025
విజయవాడ: విజయవాడలో ట్రాఫిక్‌ను రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పలు సాంకేతికంశాలను వినియోగిస్తున్నారు. ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంతో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. రద్దీపై నిఘా ఉంచేందుకు అస్త్రం యాప్‌ను తీసుకొచ్చారు. ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక: విజయవాడ నగరంలోని ఫంక్షన్ హాళ్ల వివరాలను ఈ అస్త్రం యాప్‌లో పొందుపరిచారు. ఏదైనా ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుంటే ముందుగానే నిర్వాహకులు అందుకు సంబంధించిన వివరాలను యాప్ (APP) లో నమోదు చేస్తారు. కార్యక్రమానికి ఎన్ని వాహనాలు వస్తాయి? వీఐపీల వివరాలు ఇలా అన్నీ ఇందులో ఉంచుతారు. తద్వారా పోలీసులు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపులు వంటి జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుంటుంది. ముందుగానే సమాచారం రావడంతో ట్రాఫిక్ జామ్‌లు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ సమాచారం తెలుసుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఈ అస్త్రం యాప్‌ను రూపొందించారు. నగరంలో ఎక్కడైనా వాహనాలు నిలిచిపోతే ఈ యాప్ కి తక్షణం సమాచారం వస్తుంది. 300 మీటర్ల వరకు వాహనాలు నిలిచిపోతే మోడరేట్, 300 నుంచి 500 మీటర్ల వరకు వాహనాలు (Vehicles) నిలిచిపోతే హై లెవల్ అని, 500 మీటర్లు మేర ట్రాఫిక్ నిలిచిపోతే సివియర్డ్ అని మెసేజ్ చూపిస్తుంది.ఈ సందేశాలకు సంబంధిత ప్రాంతాల ట్రాఫిక్ సీఐలు, ఇతర యంత్రాంగం తక్షణం స్పందిస్తారు.మోడరేట్ లెవల్ లో ఉన్నప్పుడే ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకుంటారు. మోడరేట్ట్ లెవల్ ట్రాఫిక్‌ను హై వరకు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటారు. సమాచార విశ్లేషణకు కమాండ్ కంట్రోల్: అస్త్రం యాప్ పంపించే సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విశ్లేషిస్తారు. దీని కోసం వెర్టికల్ మేసేజ్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ వివరాలు రికార్డు అవుతూ ఉంటాయి. ఏదైనా ప్రాంతంలో తరచూ వాహనాలు నిలిచిపోతుంటే అందుకు గల కారణాలను అన్వేషిస్తారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ధర్నా, ర్యాలీ, ఆగిపోయిన వాహనం ఇలా తదితర విషయాలను నమోదు చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ఆ ఫొటో తీసి దాన్ని సైతం అప్లోడ్ చేస్తారు.
తాజా వార్తలు
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన







