‘సు ఫ్రమ్ సో’ ఎంటర్టైనింగ్ రైడ్ ట్రైలర్ రిలీజ్
- August 05, 2025
లేటెస్ట్ కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రం సో' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుని ఆలరించడానికి రెడీ అయ్యింది. మంచి కంటెంట్ కి మద్దతుగా నిలిచే మైత్రీ మూవీ మేకర్స్ ఈ రూరల్ కామెడీ హారర్ సినిమాని ఆగస్ట్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. జెపీ తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
గ్రామీణ జానపద కథలు, మూఢనమ్మకాలు, హిలేరియస్ కామెడీ – ఇవన్నీ మిక్స్ అయ్యి వినోదాత్మక ప్రయాణమే సు ఫ్రం సో. కథ ఓ పల్లెటూర్లో జరుగుతున్న విచిత్ర సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆ గ్రామానికి ‘సోమేశ్వర’ నుంచి వచ్చిన సులోచన కారణంగా ఊరు మొత్తం గందరగోళంలో పడుతుంది. ఆ తర్వాత నవ్వుల హంగామా మొదలవుతుంది.
ఈ సినిమాలో శనీల్ గౌతమ్ ఎనర్జిటిక్ పాత్రలో అలరించారు. శాంధ్య ఆరకెరె, జెపీ తుమినాడ్, ప్రకాశ్ తుమినాడ్, రాజ్ బి శెట్టి (కో-ప్రొడ్యూసర్ ) పాత్రలు కూడా ఆకట్టుకున్నాయి.
సు ఫ్రం సో రెగ్యులర్ హారర్ కామెడీల్లా కాకుండా గమ్మత్తైన రైటింగ్, అలరించే పాత్రలు, మంచి హాస్యంతో ఆకట్టుకునే సినిమా. ఎస్. చంద్రశేఖరన్ సినిమాటోగ్రఫీ ఆ ఊరి అందాన్ని చూపిస్తే, సుమేధ్ కె, సందీప్ తులసిదాస్ అందించిన సంగీతం సినిమాకి మరింత జోష్ తీసుకొస్తుంది.
ఈ ఆగస్ట్ 8న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా నవ్వులు ప్రయాణం కాబతోంది.
తారాగణం: షనీల్ గౌతమ్, జెపి తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడు, దీపక్ రాయ్ పనాజే, మైమ్ రాందాస్
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం - JP తుమినాడ్
నిర్మాతలు - శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కలస, రాజ్ బి శెట్టి
తెలుగు రిలీజ్: మైత్రి మూవీ మేకర్స్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - ఎస్.చంద్రశేఖరన్
సంగీతం - సుమేద్ కె
బ్యాక్గ్రౌండ్ స్కోర్ - సందీప్ తులసీదాస్
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్ - ఫస్ట్ షో
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







