ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- September 10, 2025
కువైట్: కువైట్ వ్యాప్తంగా ఆసుపత్రి పార్కింగ్ స్థలాల్లో ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. జహ్రా హాస్పిటల్ 199 ఉల్లంఘనలతో అగ్రస్థానంలో నిలిచింది. ఫర్వానియా హాస్పిటల్ 67 ఉల్లంఘనలతో ఆ తరువాత స్థానంలో ఉంది. అల్-అదాన్ హాస్పిటల్ 50 కేసులతో, అల్-అమిరి హాస్పిటల్ 39, జాబర్ హాస్పిటల్ 27 ఉల్లంఘనలతో అత్యల్పంగా చివరి వరుసలో నిలిచాయి. ట్రాఫిక్ కు ఆటంకం కలిగించే మరియు అత్యవసర వైద్య సిబ్బంది పనికి ఆటంకం కలిగించే ఉల్లంఘనలను నివారణకు ప్రత్యేకంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి.
అధికారులు "రాసిడ్" వ్యవస్థను ఉపయోగించారు. ఇది వాహనాన్ని ఫోటో తీయడం ద్వారా ఉల్లంఘనలను నమోదు చేస్తుంది. "సాహ్ల్" అప్లికేషన్ ద్వారా ఉల్లంఘనదారునికి నోటీసును ఆటోమెటిక్ గా పంపుతుంది. ఈ సందర్భంగా రోగులు, ప్రత్యేక అవసరాలు ఉన్నవారు మరియు వృద్ధుల కోసం కేటాయించిన స్థలాలను కొందరు దుర్వినియోగం చేస్తూ.. పార్కింగ్ కోసం వినియోగిస్తున్నట్లు తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ధోరణులను నివారించేందుకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 24 గంటలు తనిఖీలు చేస్తుందని వెల్లడించింది. ఇలాంటి నేరాలు పునరావృతమైతే జైలు శిక్ష లేదా సమాజ సేవ , భారీ జరిమానాలు వంటి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







