మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- September 10, 2025
దోహా: ఖతార్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు 100 శాతం డిజిటలైజేషన్‌ను సాధించే దిశగా ఖతార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2030 వరకు 20 శాతం వార్షిక వృద్ధి రేటుతో పేటెంట్ల సంఖ్యను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. ఈ సందర్భంగా మేధో హక్కులను ఎలా రక్షించుకోవాలో అవగాహనను కల్పిస్తుంది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది.
పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడం వల్ల తమ ఆవిష్కరణలకు చట్టపరమైన హక్కు లభిస్తుందని, ఆతర్వాత దానిని తమ అనుమతి లేకుండా ఇతరులు దానిని ఉపయోగించకుండా నిరోధిస్తుందని పేర్కొంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ సర్వీసును యాక్సెస్ చేయడానికి అవసరమైన దశలవారిగా గైడెన్స్ ఉందని తెలిపింది.
ఈ విషయంలో మంత్రిత్వ శాఖలోని మేధో సంపత్తి హక్కుల రక్షణ విభాగం అవసరమైన సహాయం అందజేస్తుందన్నారు. ట్రేడ్‌మార్క్‌లు, కాపీరైట్, రిజిస్టర్డ్ డిజైన్లు మరియు పేటెంట్లకు సంబంధించి కొత్త చట్టాలు 2002 నుండి అమలులో ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







