దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- November 01, 2025
ముంబై: ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke International Film Festival – DPIFF) 2025 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి బాలీవుడ్, టాలీవుడ్, కొలీవుడ్ సహా పలు భాషల సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకలో టాలీవుడ్‌కి గర్వకారణంగా నిలిచింది ప్రభాస్ నటించిన ‘కల్కి 2898AD’ (Kalki Movie) చిత్రం. ఇది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ (Film of the Year) అవార్డు అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తన విజువల్ గ్రాండియర్, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్, కథా నిర్మాణం, ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
ఈ అవార్డు ద్వారా తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హర్రర్ కామెడీ జానర్లో సంచలనం సృష్టించిన‘స్త్రీ-2’ బెస్ట్ మూవీలుగా నిలిచాయి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప-2), బెస్ట్ యాక్టర్‌గా కార్తీక్ ఆర్యన్, బెస్ట్ యాక్ట్రెస్‌గా కృతి సనన్, బెస్ట్ డైరెక్టర్‌గా కబీర్‌ఖాన్‌కు అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







