మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- November 02, 2025
మనామా: మధ్యప్రాచ్య శాంతికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని బహ్రెయిన్ స్పష్టం చేసింది. డిఫ్లొమసీ, ఎకానమీ, డిఫెన్స్ ద్వారా గల్ఫ్ ను సురక్షితంగా ఉంచడం ఎలా అనే థీమ్‌తో జరిగిన IISS మనామా డైలాగ్ 2025 రెండవ రోజు బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ పాల్గొని ప్రసంగించారు.
గల్ఫ్ లో శాంతి మరియు భద్రత కోసం ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులు ఐక్యంగా కలిసి కట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గల్ఫ్ లో శాశ్వతంగా శాంతి నెలకొనడానికి పాలస్తీనా స్టేట్ ఏర్పాటు అనేది అత్యవసరమని స్పష్టం చేశారు. భద్రత, శాంతి అనేది ఏ ఒక్క దేశం కారణంగా సాధ్యం కాదని, ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని డాక్టర్ అబ్దులతీఫ్ బిన్ రషీద్ అల్జయానీ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







