ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!

- November 12, 2025 , by Maagulf
ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!

దుబాయ్: యూఏఈలో ఈ వారం ప్రారంభంలో  భవనం పై నుంచి పడి ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకు చెందిన మిషాల్ మొహమ్మద్ దుబాయ్‌లోని తన బంధువుల ఇంటికి వెళుతుండగా ఈ విషాద ప్రమాదం జరిగింది.
ఈ కేసును ఫాలో అవుతున్న సామాజిక కార్యకర్త M.K. ప్రకారం, 19 ఏళ్ల ఆ యువకుడికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. “అతను తన బంధువుల కుటుంబంతో కలిసి హోర్ అల్ అంజ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. భవనం యొక్క మూడవ అంతస్తు టెర్రస్ నుండి, విమానాలు దగ్గరగా కనిపించాయి. అతను దాని ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి భవనం పై నుండి పడిపోయాడు.” అన పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే  రషీద్ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతను మరణించాడని వారు తెలిపారు.  
మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన లాంఛనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com