ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- November 14, 2025
యూఏఈ: యూఏఈలో డిసెంబర్ 8 నుండి జనవరి 4 వరకు దాదాపు ఒక నెల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. దీంతో రాబోయే ట్రావెల్ సీజన్‌కు డిమాండ్ పెంచనున్నాయి. జాతీయ దినోత్సవం, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సెలవుల నేపథ్యంలో బుకింగ్‌లు 35 శాతం పెరిగాయని ట్రావెల్ రంగ నిపుణులు తెలిపారు.
డిసెంబర్ నెలకు బుకింగ్‌లు ఇప్పటికే అధిక స్థాయికి చేరుకున్నాయని, స్కూల్ సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి మరియు నెల చివరిలో పెరుగుతున్న ఛార్జీలను నివారించడానికి చాలా మంది నివాసితులు ముందుగానే లాక్ చేస్తున్నారని musafir.com సీఓఓ రహీష్ బాబు తెలిపారు. మరోవైపు జాతీయ దినోత్సవం మరియు క్రిస్మస్-నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రెండింటికీ సీట్లు వేగంగా నిండిపోతున్నాయని గలాదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ మేనేజర్ మీర్ వాసిం రాజా తెలిపారు. ఈ సంవత్సరం కుటుంబాలు చాలా ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభించాయని ఆయన అన్నారు.
వియత్నాం, జపాన్ లతోపాటు పారిస్, రోమ్, లిస్బన్, బుడాపెస్ట్, స్విట్జర్లాండ్ మరియు ఇటలీ దేశాలకు వెళ్లేందుకు అధికంగా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. మరోవైపు సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ మరియు ఈజిప్ట్ దేశాలకు కూడా డిమాండ్ అధికంగా ఉందన్నారు. రియాద్ సీజన్ మరియు ఖతార్ వింటర్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు కూడా ఈ డిమాండ్ కు కారణమని ట్రావెల్ ఏజెంట్లు చెప్పారు. అదే సమయంలో ట్యునీషియా, మొరాకో వంటి ఉత్తర ఆఫ్రికా గమ్యస్థానాలు, లాట్వియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలకు ప్రయాణికుల ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. క్రూయిజ్‌లకు ఆదరణ ఉందన్నారు.
చివరి సమయాల్లో డిమాండ్ అధికంగా ఉంటుందని, దానికి తగ్గట్టే ధరలకు రెక్కలు వస్తాయన్నారు. ముందుకు ప్రణాళికలు వేసుకొని, బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుంటే హ్యాపీగా తక్కువ ఖర్చులతో హాలీడే సీజన్ ను ముగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







