కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- December 07, 2025
కువైట్: కువైట్ లో భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వాటి పంపిణీ ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నట్టు మాదకద్రవ్య నియంత్రణ డైరెక్టరేట్ తెలిపింది. కచ్చితమైన సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించినట్లు ఇంటిరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. డ్రగ్స్ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఒక నిందితుడు, ఈ డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ అని వెల్లడించారు. అతను ఓ క్రిమినల్ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ దందాను నడుపుతున్నట్లు తెలిపారు.
అనుమానితులలో ఒకరిపై ఫోకస్ పెట్టిన భద్రతా బృందాలు, అతడిని వెస్ట్ అబ్దుల్లా అల్-ముబారక్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొని విచారించింది.అతడిచ్చిన సమాచారం మేరకు అల్-సల్మి ఎడారిలోని ఒక ప్రైవేట్ శిబిరంపై రైడ్స్ చేశారు.అక్కడి నుంచి 40 కిలోగ్రాముల రసాయన పదార్ధం, 60 కిలోగ్రాముల లిరికా పౌడర్, 8 కిలోగ్రాముల గంజాయి, 500 గ్రాముల హషీష్, 5 లీటర్ల క్రిస్టల్ మెత్, 300 లీటర్ల రసాయన ద్రవం, 7 కిలోగ్రాముల రసాయన పేపర్ తోపాటు డ్రగ్స్ తయారీలో ఉపయోగించే మెషినరీని స్వాధీనం చేసుకున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







