ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- December 07, 2025
మస్కట్: 2025-2026 వింటర్ పర్యాటక ప్రమోషన్ ను ఒమన్ ప్రారంభించింది. ఒమన్ లోని విభిన్న పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక వారసత్వ కట్టడాలు, ట్రెక్కింగ్, ప్రముఖ బీచ్ లు, పార్కులు, అందుబాటులో ఉండే ప్యాకేజీలు, హోటల్స్ తదితర వివరాలతో కూడిన సమగ్ర ప్రణాళికలను పర్యాటక మంత్రిత్వశాఖ ఆవిష్కరించింది.ఈ సందర్భంగా పలు ప్రమోషన్ వీడియోలను విడుదల చేశారు.
ఈ సంవత్సరం ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వాముల సహకారంతో నాణ్యమైన ప్రమోషనల్ కార్యక్రమాలు, డిజిటల్ మార్కెటింగ్ పై దృష్టి సారించినట్టు టూరిజం ప్రమోషన్ డైరెక్టర్ జనరల్ హైతం మొహమ్మద్ అల్ గస్సాని తెలిపారు.ఈ సీజన్ లో అంతర్జాతీయ పర్యాటకులే లక్ష్యంగా ప్రమోషన్ కార్యాకలాపాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







