మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!

- December 07, 2025 , by Maagulf
మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!

రియాద్: ఇథియోపియాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే సౌదీ పౌరులకు ఇథియోపియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ ఇథియోపియాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం మార్బర్గ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండాలని సూచించారు. ఈ మేరకు అడ్డిస్ అబాబాలోని సౌదీ రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని అందులో ఎంబసీ కోరింది.సహాయం కోసం 24/7 పనిచేసే రాయబార కార్యాలయం అత్యవసర హాట్‌లైన్‌ను సంప్రదించాలని సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com