తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- December 07, 2025
మనామా: బహ్రెయిన్ లో చట్టాలను ఉల్లంఘించి కంటెంట్‌ను వినియోగించిన తొమ్మిది సోషల్ మీడియా ఖతాలపై చర్యలు తీసుకున్నారు. జనరల్ డైరెక్టరేట్ ఫర్ యాంటీ-కరప్షన్, ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ కింద ఉన్న యాంటీ-సైబర్ క్రైమ్స్ డైరెక్టరేట్ తొమ్మిది సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలను ప్రారంభించాయని బహ్రెయిన్ ఇంటిరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.
పౌరుల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో కూడిన విషయాలను పంచుకుంటున్నట్లు విచారణలో గుర్తించారు.ఇది పౌర శాంతికి ముప్పు కలిగిస్తుందని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాంటి కంటెంట్‌ను తిరిగి పోస్ట్ చేసే వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు.సామాజిక సామరస్యాన్ని కాపాడాలని, బహ్రెయిన్ విలువలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







