ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- December 09, 2025
మస్కట్: రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM) ఆధ్వర్యంలో డిసెంబర్ నెలకు సంబంధించి వివిధ ఈవెంట్ల పరంపర ప్రారంభమైంది. ప్రేక్షకులకు బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్ట్ మరియు ఫెస్టివ్ కార్యక్రమాలను అందిస్తున్నాయి. వీటిలో కొప్పెలియా, సింఫనీ ఆఫ్ లైట్స్, రాయల్ బ్యాంకాక్ సింఫనీ ఆర్కెస్ట్రా కాన్సర్ట్, ది మ్యాజిక్ ఆఫ్ ది వింగ్స్ మరియు లెట్స్ రీడ్ వంటి కార్యక్రమాలు ఆహ్వానం పలుకుతున్నాయి.
ఈ గురువారం "ఒమానీ నైట్" లో సయ్యద్ ఖలీద్ బిన్ హమద్ అల్ బుసైది మ్యూజిక్ ను ఆస్వాదించవచ్చు. ప్రముఖ ఒమానీ కళాకారులతో కలిసి రాయల్ ఒమన్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శన హైలెట్ గా నిలువనుంది. పిల్లల కోసం "ది మ్యాజిక్ ఆఫ్ ది వింగ్స్" ప్రదర్శన వచ్చే గురువారం నిర్వహిస్తున్నారు.
ఇక సింఫనీ ఆఫ్ లైట్స్ డిసెంబర్ 18 మరియు 19 తేదీలలో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ వేదికపై ఆకట్టుకోనుంది. అన్ని వయసుల వారికి అనువైన ఆకర్షణీయమైన వేడుకగా ఇది ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 31న రాయల్ బ్యాంకాక్ సింఫనీ ఆర్కెస్ట్రా ప్రదర్శించే మ్యూజిక్ కాన్సర్టుతో డిసెంబర్ నెలకు సంబంధించి ఫ్యామిలీ ఈవెంట్ సీజన్ ముగుస్తుందని రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







