బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!

- December 09, 2025 , by Maagulf
బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!

మనమా: బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది.  చట్ట, న్యాయపరమైన మరియు పెట్టుబడి సంబంధిత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్.. భారత అధికారులతో చర్చలలో బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. భారత తరపున న్యాయ శాఖ మంత్రి మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ మరియు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ (BICC) న్యాయమూర్తి డాక్టర్ పింకీ ఆనంద్, న్యూఢిల్లీలోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం నుండి మహదీ జాఫర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెట్టుబడుల ప్రోత్సాహం, న్యాయ సమన్వయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం ఆధునిక చట్టాల పరిధిలో అభివృద్ధి వంటి రంగాలలో రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.  

నవంబర్ 2025లో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ (BICC) అధికారికంగా ప్రారంభించడంపై హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడుల రాకను సులభతరం చేయడానికి, చట్టపరమైన సంబంధాలను మెరుగుపరచడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఇరుపక్షాలు సమీక్షించాయని ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com