గల్ఫ్ దేశాల పై దాడులు ఆపాలంటూ సమితిలో తీర్మానం
- March 12, 2026
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని కాస్తయినా ఆపేందుకు అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు చేపట్టింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానం భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి భారతదేశం కో-స్పాన్సర్‌గా నిలిచి తన వ్యూహాత్మక మద్దతును ప్రకటించడం గమనార్హం కాగా ఇరాన్‌కు మిత్ర దేశాలు అయిన చైనా, రష్యా వంటి దేశాలు కనీసం దీనికి అడ్డు చెప్పలేకపోయాయి.ముఖ్యంగా ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉండడమే కాకుండా ఖమేనీ మృతి గురించి చర్చ తీసుకురాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాయి.
బహ్రెయిన్ నేతృత్వంలో వచ్చిన ఈ తీర్మానానికి ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలు మద్దతు తెలిపాయి. అందులో భారత్ కూడా ఉండడం గమనార్హం. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని ఇది ప్రపంచ శాంతికి పెను ముప్పుగా మారిందని ఈ తీర్మానం చెప్పింది. ప్రధానంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఐరాస స్పష్టం చేసింది. అంతేకాకుండా హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకోవడాన్ని, సముద్ర మార్గాల్లో అశాంతిని సృష్టించడాన్ని భద్రతా మండలి ఏక కంఠంతో ఖండించింది.
భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉండగా 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఇరాన్‌కు ఆప్త మిత్రులుగా పేరున్న రష్యా, చైనాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కేవలం ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. అయితే ఈ తీర్మానంపై రష్యా, చైనా అసంతృప్తి వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం









