భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామనేది పగటి కల: మంత్రి శ్రీధర్‌బాబు

- May 24, 2026 , by Maagulf
భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామనేది పగటి కల: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి కానీ అభివృద్ధిని అడ్డుకునే ఆలోచనలు చేయకూడదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఎన్నికల ఓటమి నిరాశ నుంచి బయటపడలేదని, హరీష్ రావు అమెరికా వెళ్లి కూడా 'భారత్ ఫ్యూచర్ సిటీ'ని రద్దు చేస్తామని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేసే ముందడుగు అని, ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌గా మారబోతోందని, దీన్ని రద్దు చేస్తామని చెప్పడం తెలంగాణకు ద్రోహమని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com