శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

- May 24, 2026 , by Maagulf
శ్రీ శ్రీ రవిశంకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర

బెంగళూరు: బెంగళూరులోని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ నేత గురుదేవ్‌ను దర్శించుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు పొందారు.

గురుదేవ్‌ను కలవడం ఎంతో అద్భుతమైన అనుభూతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక భావన కలిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

2024 ఎన్నికలకు ముందు గురుదేవ్ ఆశీస్సులు తనకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని, ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చాయని అన్నారు. ఆ ఆశీస్సుల ఫలితంగానే సుమారు 50 వేల ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించానని వ్యాఖ్యానించారు.

“ప్రతి ఒక్కరిలో అంతర్గత శక్తి ఉంటుంది. ఆ శక్తిని గుర్తించడమే అసలైన పరీక్ష” అనే గురుదేవ్ సందేశం తనలో కొత్త ఉత్తేజాన్ని నింపిందని చెప్పారు. ప్రశాంతత మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుందని, గురుదేవ్ బోధనలు మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి ప్రేరణనిస్తున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌కు అభిమానులు, శిష్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com