తెలంగాణ ప్రజలకు బిగ్అలర్ట్..

- May 24, 2026 , by Maagulf
తెలంగాణ ప్రజలకు బిగ్అలర్ట్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 10గంటల నుంచి భానుడు ప్రతాపం చూపుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఎండలు దంచికొడుతున్న వేళ వాతావరణ శాఖ కీలక హెచ్చరిలను జారీ చేసింది. నేటి నుంచి మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతోపాటు వడగాలుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి ఈనెల 26వ తేదీ వరకు కుమ్రుంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాటపే, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వడగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


శనివారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ధర్మపురి మండలం బుద్ధేశ్ పల్లిలో అత్యధికంగా 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు తోడకావడంతో ఎండదెబ్బ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఒక్కరోజు ఎండ తీవ్రతను తాళలేక రాష్ట్ర వ్యాప్తంగా 40మంది వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఒకవేళ వచ్చినా ఎండదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముందుకు అనుకున్నట్లుగానే ఈనెల 26వ తేదీ నాటికి కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని అంచనా వేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేఅ వకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com