ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్‌మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!

- May 24, 2026 , by Maagulf
ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్‌మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!

యూఏఈ: యూఏఈ వ్యాప్తంగా ఉన్న హైపర్‌మార్కెట్లు, ప్రధాన రిటైలర్లు ఈద్ అల్ అదా సందర్భంగా నిత్యావసర మరియు పండుగ వస్తువులపై 50 శాతం వరకు తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి.  

యూఏఈలో ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఈద్ అల్ అదా 2026 సందర్భంగా మే 26నుండి మే 29 వరకు నాలుగు రోజుల వేతనంతో కూడిన సెలవును పొందుతారు. శనివారం-ఆదివారం వీకెండ్ సెలవులు ఉన్నవారికి, ఇది ఆరు రోజుల బ్రేక్ ను కల్పిస్తుంది.  ఇది ఈద్ షాపింగ్‌ను మరింత పెంచుతుందని భావిస్తున్నట్టు యూనియన్ కూప్ సీఈఓ మహమ్మద్ అల్ హషేమి తెలిపారు. తమ రిటైలర్ పలు నిత్యావసర మరియు పండుగ ఉత్పత్తులపై 50 శాతానికి పైగా తగ్గింపులతో ఈద్ అల్ అదా ప్రమోషన్లను ప్రారంభించిందని తెలిపారు.

పండుగ సీజన్‌లో కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి వందలాది ఆహార మరియు వినియోగ వస్తువులపై సీజనల్ ప్రమోషన్లు మరియు తగ్గింపులను ప్రవేశపెట్టినట్టు షార్జా కూప్ సీఈఓ మజేద్ అల్ జునైద్ తెలిపారు. ఈ ఆఫర్లలో నిత్యావసర వస్తువులు మరియు ఈద్ సంబంధిత ఉత్పత్తులతో పాటు మెరుగైన లాయల్టీ మరియు రివార్డ్ ప్రోగ్రామ్‌లు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే, బలి ఇచ్చే జంతువుల బుకింగ్ సేవలను అందించడం ద్వారా తన ఈద్ అల్ అదా సేవలను కూడా విస్తరించిందన్నారు.

అలాగే, అల్ మాయా గ్రూప్ తమ అన్ని అవుట్‌లెట్లలో విస్తృతమైన ప్రమోషన్లు మరియు ప్రత్యేక ఈద్ కలెక్షన్లను ప్రకటించింది. తాజా పండ్లు మరియు కూరగాయలు, ప్రీమియం బియ్యం, వంట నూనె, ఫ్రోజెన్ ఫుడ్, పాల ఉత్పత్తులు, పానీయాలు, మిఠాయిలు, చాక్లెట్లు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, బేకరీ వస్తువులు మరియు గృహావసరాలపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని డిప్యూటీ సీఈఓ మరియు గ్రూప్ డైరెక్టర్ కమల్ వచాని తెలిపారు.

అదేవిధంగా బియ్యం, పిండి, పప్పులు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్, స్వీట్లు, రెడీ-టు-కుక్ వస్తువులు మరియు ఇతర పండుగ అవసరాలపై కూడా ప్రత్యేక ఈద్ ప్రమోషన్లు మరియు ఆఫర్లు నడుస్తున్నాయని అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ చెప్పారు.  

పండుగ డిమాండ్‌లో భారీ పెరుగుదల

కుటుంబాలు పెద్దమొత్తంలో కొనుగోలు చేయడంతో ఈద్ అల్ అదా సమయంలో డిమాండ్‌లో స్పష్టమైన పెరుగుదల ఉందని రిటైలర్లు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు పండుగకు చాలా ముందుగానే సరుకులను కొనుగోలు చేస్తుంటారని పేర్కొన్నారు.  

ఈద్ అల్ అదాకు ముందు డిమాండ్‌లో పెరుగుదల ఉందని యూనియన్ కూప్‌కు చెందిన అల్ హషేమి పేర్కొన్నారు. ముఖ్యంగా మాంసం, చికెన్, పండ్లు మరియు కూరగాయల వంటి తాజా ఉత్పత్తుల కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు చాక్లెట్లు, ఖర్జూరాలు, స్వీట్లు, పానీయాలు, ఫ్రోజెన్ ఫుడ్, గిఫ్ట్ ప్యాక్‌ల వంటి విభాగాలలో అమ్మకాలు భారీగా పెరిగాయని అన్నారు.

ఆహార ఉత్పత్తులు, తాజా ఉత్పత్తులు మరియు అనేక రకాల వినియోగ వస్తువులకు అధిక డిమాండ్‌ ఉందని షార్జా కూప్ తెలిపింది. సాధారణంగా బియ్యం, గోధుమ పిండి, పప్పులు, వంట నూనె, నెయ్యి, మసాలాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, సేమ్యా, స్వీట్లు, స్నాక్స్ మరియు రెడీ-టు-కుక్ లేదా ఇన్‌స్టంట్ ఐటమ్స్‌కు బలమైన డిమాండ్ ఉంటుందని డాక్టర్ దాతర్ వెల్లడించారు. వీటితోపాటు ప్రీమియం డ్రై ఫ్రూట్స్, బహుమతి వస్తువులు, ఫ్యామిలీ సైజ్ ప్యాక్‌ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు.

ఇక పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా సఫ్లై చైన్ లను బలోపేతం చేసి, స్టాకులను పెంచుకున్నామని ప్రధాన రిటైలర్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈద్ అల్ అదా వంటి అత్యధిక డిమాండ్ ఉన్న సీజన్లలో స్టోర్లలో షెల్ఫ్‌ లను సరుకులతో నిండుగా ఉంచడానికి యూనియన్ కూప్ ఏడాది పొడవునా సరఫరాదారులతో కలిసి పనిచేస్తుందని అల్ హషేమి అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com