నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!

- May 24, 2026 , by Maagulf
నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన  ILA బహ్రెయిన్..!!

మనామా: 70 సంవత్సరాల సమాజ సేవ మైలురాయిని పురస్కరించుకుని, ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ILA) బహ్రెయిన్ ప్రతిష్టాత్మకమైన “నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026”ను ప్రకటించింది. బహ్రెయిన్ లో సేవలందిస్తున్న నర్సింగ్ కమ్యూనిటీ అంకితభావాన్ని గౌరవించడం మరియు వారికి నివాళులర్పించడం ఈ కార్యక్రమ లక్ష్యమని ప్రకటించారు.

ఈ చారిత్రాత్మక వేడుకలలో భాగంగా నర్సింగ్ వృత్తిలో 25 సంవత్సరాలకు పైగా అసాధారణమైన సేవను పూర్తి చేసిన వివిధ దేశాలకు చెందిన 70 మంది నర్సులను ILA బహ్రెయిన్ సత్కరించనుంది.  అమెరికన్ మిషన్ హాస్పిటల్ (AMH) సహకారంతో ఈ పురస్కార ప్రదానోత్సవాన్ని జూన్ 3న సాయంత్రం 6:30 గంటలకు ఆలీలోని కింగ్ హమద్ అమెరికన్ మిషన్ హాస్పిటల్‌లో నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com