ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 09, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను తాను అడ్డుకుంటున్నానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానన్నారు. సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ రేవంత్‌రెడ్డిపై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిలాగా తాను మాటకారిని కాను.. కానీ మాటపై నిలబడే వ్యక్తిని అని కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. పదవులు, అధికారం కోసం మాటలు మార్చే వ్యక్తిని తాను కానని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని అధికార పార్టీ నేతలకు కిషన్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. మీరిచ్చిన ఏ గ్యారంటీ అయినా అమలు చేశారా? అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని వ్యంగ్యంగా అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, ప్రజలను వంచించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందేనని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మాత్రం మారలేదంటూ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి సోకులు చేస్తున్నారంటూ గత బీఆర్ఎస్, ప్రస్తుత రేవంత్ సర్కార్ తీరును ఆయన ఎండగట్టారు. హైదరాబాద్‌లో భూములు మిగిలే పరిస్థితి లేదన్నారు. మంత్రులతోపాటు అందరూ భూ దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యిందని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గమనించాలంటూ తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా సూచించారు. సీఎం రేవంత్‌కు తాము గులాంలు కామన్నారు. తనకు సీఎం రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు..
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్‌ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









