వైమానిక సహాయకురాలిని ముద్దాడిన ప్రయాణీకుడికి మూడు నెలల జైలుశిక్ష
- September 02, 2016
దుబాయ్: ' ము...ము...ముద్దు అంటే చేదా ? నీకా ఆ ఉద్దేశ్యం లేదా ' ... అని ఏకంగా విమానంలోని సహాయకురాలికి చటుక్కున ఓ ముద్దు పెట్టిన విమాన ప్రయాణికుడికి జైలుశిక్ష అనంతరం యుఎఇ నుంచి దేశ బహిష్కరణ రెండు లభించాయి. టాంజానియా నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ విమాన సహాయకురాలితో సెల్ఫీ ఫోటో దిగుతానని ఓ ప్రయాణికుడు ఆమెను ఒప్పించి ఆకస్మికంగా ముద్దాడి ముప్పతిప్పలు పాలయ్యాడు. 'లైంగికంగా మహిళని వేధించిన ' కేసులో 42 ఏళ్ల టాంజానియా వ్యక్తి ముద్దాయి అని నిర్ధారించిన దుబాయ్ క్రిమినల్ కోర్ట్ తన నివేదికలో పేర్కొంది.
విమాన సహాయురాలైన 25 ఏళ్ల అమెరికన్ యువతీ వద్దకు వెళ్లిన టాంజానియా వ్యక్తి తనతో సెల్ఫీ ఫోటోకు ఒక ఫోజు ఇవ్వాలని కోరాడు. ఆమె ఒప్పుకొనడమే తడవుగా లటుక్కున ఆమెను మీదకు లాక్కొని కౌగలించుకొని చటుక్కున ముద్దు పెట్టుకొన్నాడు. దాంతో విస్తుపోయిన ఆమె ఈ విషయమై ఏప్రిల్ నెలలో పోలీసులకు పిర్యాదు చేసింది.
ఆ స్త్రీ కోర్టులో నాటి సంఘటన గూర్చి మాట్లాడుతూ, "ఆ వ్యక్తి తనతో ఒక సెల్ఫీఫోటో దిగుతానని తొలుత అభ్యర్ధించాడు దానికినేను ఓ కే అన్నాను . నేను ఫోటో కోసం అతని పక్కన నిలిచినప్పుడు నన్ను అతను గబుక్కున కౌగిలించుకొన్నాడు. అంతే కాక నా మెడపై ముద్దాడినట్లు వెంటనే తేరుకున్నతాను ఆ వ్యక్తిని దూరంగా నెట్టివేసినట్లు సాక్ష్యం ఇచ్చింది, పోలీసు తెలిపిన వివరాల ప్రకారం, టాంజానియా వ్యక్తి మొదట సంఘటనపై తన తప్పుని అంగీకరించాడు, కానీ తరువాత ఆమెను 'లైంగిక వేధింపులకు' ఏమాత్రం గురిచేయలేదని జూన్ నెలలో కోర్టు విచారణ సందర్భంగా ఖండించాడు. అయితే, న్యాయస్థానం ఆ వ్యక్తిని దోషిగా నిర్ణయించి మూడు నెలల జైలుశిక్ష విధించింది ఆ తర్వాత దేశమునుండి బహిష్కారించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







