APNRT కో-ఆర్డినేటర్ హరిబాబు తక్కెళ్ళపాటి(బహ్రెయిన్)తో ముఖాముఖి

- September 29, 2016 , by Maagulf
APNRT కో-ఆర్డినేటర్ హరిబాబు తక్కెళ్ళపాటి(బహ్రెయిన్)తో ముఖాముఖి

Q: ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ కో-ఆర్డినేటర్లుగా మీ బాధ్యత ఏమిటి? 

A: 1. మేము సభ్యత్వ నమోదు చేపట్టి ఖచ్చితంగా APNRT లో తెలుగు వారు అంత నమోదు  చేయించే బాధ్యత తీసుకొంటాము. 
2. మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల పెట్టమని అందరూ NRI లను అలాగే ఇతర ఇన్వెస్టర్స్ ని కోరుతాము. 
3. గ్రామం దత్తత ప్రచారం మరియు నా వంతు గ కూడా ఒక గ్రామం దత్తత చేసుకొని దాని అభివృద్ధి కోసం ప్రయత్నిస్తాము. 

Q: ఆంధ్రప్రదేశ్‌తో విదేశాల్లోని తెలుగువారిని కలిపేందుకు ముందుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల మీ స్పందన ఏమిటి? 

A: చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తెలుగు సమాజానికి యునైటెడ్ గా వుంచగలరు అని ఈ ప్రోగ్రాం ద్వారా మరల నిరూపించారు.
నేను ఇది చాలా మంచి పని అని భావిస్తున్నాను మరియు నాకు చాలా సంతోషం గా కూడా వుంది.  

Q: మాతృభూమికి ఎంతో కొంత చేయాలన్న సంకల్పం చాలా గొప్పది, ఈ సంకల్పాన్ని విదేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారెలా భావిస్తున్నారు? 

A: చాలా మంది సానుకూలంగా స్పందిస్తునారు  మరియు కొందరు వారి గ్రామాలు అభివృద్ధి కొరకు ప్రభుత్వం తో కలిసి నడిచేందుకు చొరవగా ముందుకు వస్తున్నారు. 

Q: కొత్త రాష్ట్రం, కోటి సమస్యలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఎన్‌ఆర్‌ఐల తోడ్పాటు ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారు? 

A: అందరూ NRI లు ముందుకు వచ్చి అబివృద్ది లో పాల్గొంటే బాగుంటది. పుట్టిన ఊరి కోసం ప్రతి NRI ఉడతా భక్తి సాయం ిన సరే చేయాలి అని కోరుకొంటున్నాను. 
గ్రామాలకు వారి అమలు పర్యవేక్షించడానికి Janamaboomi కమిటీని అలాగే ఇతర ప్రభుత్వ కార్యక్రమాలలో ఎన్నారైలకు అవకాశం కలిగి ఉంటీ బాగుంటది. 
 

Q: ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా లేని కొత్త విధానం, కొత్త ఆలోచన ఇది. ఈ ఆలోచన విదేశాల్లో ఉన్న వారిగా మీకెలా అనిపిస్తోంది? 
A: ఇది చాలా సంతోషమమెన అనుభూతి. APNRT ద్వారా మా గ్రామాలకు సహాయం చేయుట గర్వంగా భావిస్తున్నాను.

Q: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మీకు ఈ విషయంలో అందించే సహాయ సహకారాలు ఎలా ఉంటున్నాయి? 

A: బాగుంది అలాగే మా నుంచి విన్నపాలు స్వీకరించే వ్యవస్థే ఒకటి ఉంటే బాగుంటది అలాగే ఆ విన్నపాలు అమలు ఎలా వుంది అని పర్యవైకిచిoచే  బాధ్యత కూడా APNRT టీం కి ఇస్తే బావుంటుంది అని నా విన్నపం.  
 
Q: మాతృభూమికి సేవ చేయడం ఓ గొప్ప అవకాశం. ఆ అవకాశం కల్పించిన ప్రభుత్వానికి మీ తరఫున ఎలా కృతజ్ఞత తెలుపుతారు? 

A: ప్రతి ప్రభుతవ్వ కార్యక్రమాల్లోను పాల్గొంటాం. మేము ఇలా ఈ రోజు NRI  గా ఉండటానికి కారణమా ఐనా CBN గారికి ఎప్పుడు కృతఙతలు తెలుపుకొంటున్నాము. మా వంతు సహాయం చేయటానికి ఎల్లపుడు ముందు ఉంటాము.  మా గ్రామానికి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటము చేసాము.
 
Q: ప్రభుత్వ ఆలోచనల్ని విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐల వద్దకు తీసుకెళ్ళడానికి మీరు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు? 

A: వాట్సాప్ గ్రూప్స్ తాయారు చేసాము అలాగే అందరికి సమాచారం చేరె విధంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. 
అమరావతి ప్రబోత్స్మవ సంబరాలు బహ్రెయిన్ లో చేసాము. 
అందరిని APNRT లో సభ్యులు గా చేయటానికి మా వంతు గా వేరు వేరు కార్యక్రమాలు చేస్తున్నాము.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com