ప్రముఖ గీత రచయిత చంద్ర బోస్ తో మాగల్ఫ్.కామ్ ముఖాముఖి

- November 19, 2016 , by Maagulf
ప్రముఖ గీత రచయిత చంద్ర బోస్ తో మాగల్ఫ్.కామ్ ముఖాముఖి

ప్రముఖ గీత రచయిత చంద్ర బోస్ దుబాయ్ విచ్చేసిన సందర్భంగా మాగల్ఫ్.కామ్ వారితో ముఖాముఖీ.

ప్ర) మీరు ప్రస్తుతం దుబాయ్ రావటానికి కారణం తెలుసుకోవచ్చా?
జ) ప్రతి సంవత్సరం దుబాయ్ అవార్డుల నిమిత్తం రావటం జరుగుతూనే ఉంది. కానీ ఈ సారి వచ్చినది పాటల రచనకు మాత్రమే.


ప్ర) దుబాయ్ ఎంచుకోవడంలో ఏదన్న ప్రత్యేకత ఉందా?
జ) దుబాయ్ లో సహజంగా అత్యధిక చిత్ర షూటింగులు మరియు అవార్డుల ఫంక్షన్లకు కేంద్ర బిందువుగా మారడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇలా సంగీత చర్చలకు రావటం ఇదే ప్రధమం అని మరియు ఇక్కడి వాతావరణం ఎంతో స్ఫూర్తినిస్తుందని అందుకే దుబాయ్ ఎంచుకున్నాం అని తెలియజేసారు.


ప్ర) మీరు పాటలు రచిస్తున్న చిత్రం గురించి వివరిస్తారా?
జ) హీరో రాంచరణ్ మరియు సుకుమార్ గారి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి గాను ఇక్కడ దుబాయ్ లో పాటల రచనలు చేస్తున్నాం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దుబాయ్ లోని అందాలు శీతాకాలం లో మరీ ఆహ్లాదకరంగా ఉంటాయని అందుచేత ఇక్కడికి రావటం జరిగిందని మాగల్ఫ్.కామ్ కు తెలియజేసారు.


ప్ర) రాంచరణ్ మరియు సుకుమార్ గారి చిత్రం ఎప్పుడు విడుదల అయ్యే అవకాశం ఉంది?
జ) ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు.


ప్ర) మాగల్ఫ్.కామ్ గురించి మీ అనుభవం మాతో పంచుకోగలరా?
జ) "మాగల్ఫ్.కామ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు తో నాకు కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉంది. వారు మరియు మాగల్ఫ్ టీం తెలుగు కమ్యూనిటీకి చేసే కృషి అభినందనీయం. దుబాయ్ వస్తే నేను కలిసే అతి కొద్దిమందిలో ఒకరు శ్రీకాంత్. ఈ సందర్భంగా వారితో కాసేపు ముచ్చటించటం సంతోషంగా ఉంది" అని తెలిజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com