ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ ఎజిఎంలో వాడి వేడి చర్చ
- November 25, 2016
ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ఐఎస్బి) యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఎజిఎం) రిఫ్ఫా క్యాంపస్లో జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సమావేశంలో తల్లిదండ్రుల డిమాండ్ మేరకు స్కూల్ టీచర్స్ ట్యూషన్ చెప్పడాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలనే అంశంపైన చర్చ జరిగింది. అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తుండడం వల్ల సాధారణ విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యాభ్యాసం కష్టతరంగా మారుతోంది. అయితే ఈ అంశంపై ఐఎస్బి చైర్మన్ ప్రిన్స్ ఎస్ నటరాజన్ మాట్లాడుతూ, అత్యధికంగా ఫీజులు వసూలు చేయడాన్ని తాము కూడా సమర్థించబోమని చెప్పారు. ప్రైవేట్ ట్యూషన్లకు సంబంధించి స్కూల్ సెక్రెటరీ డాక్టర్ షెమిలి పి జాన్ మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఖచ్చితమైన గైడ్ఐలైన్లతో కూడిన సర్కులర్ని విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇంకా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. చర్చల సారాంశాన్ని స్కూల్ యాజమాన్యం మినిస్ట్రీకి తెలియజేయనుంది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









