తెలంగాణ వాసి సౌదీలో గుండెపోటుతో మృతి
- March 12, 2017
పొట్ట కూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన ఆ కార్మికుడు తనకు రావాల్సిన బకాయిల కోసం కాళ్లరిగేలా తిరిగి తిరిగి అలసిపోయి.. గుండెపోటుతో మరణించాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతానికి చెందిన పొన్నం సత్యనారాయణ (48) 20 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లాడు. ఒక నిర్మాణ సంస్ధలో పని చేస్తుండగా 2015 సంవత్సరం నుంచి చమురు సంక్షోభం కారణంగా పనులు తగ్గడంతో సకాలంలో జీతాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కార్మికుల బకాయిల చెల్లింపు కోసం కంపెనీ యాజమాన్యంపై సౌదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. దశల వారీగా బకాయిలు చెల్లిస్తున్న తరుణంలో సత్యనారాయణ గుండెపోటుతో మరణించడంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







