46 మంది సజీవసమాధి చెత్తకుప్పలు కూలి
- March 12, 2017
దేశరాజధాని అడిస్ అబాబా శివారు ప్రాంతంలోని కోషే వద్ద భారీ కొండల తరహాలో పోగుపడిన చెత్తాచెదారం అంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయి దిగువన ఉన్న నిరుపేదల మురికివాడను దాదాపుగా నేలమట్టం చేసింది. ఈ చెత్తకింద చిక్కుకుపోయి కనీసం 46 మంది మరణించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు మహిళలూ, పిల్లలే. శనివారం జరిగిన ఈ భారీ ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఎంతోమంది గల్లంతైపోయారు. చెత్తకుప్పలు కూలిపోయిన సమయంలో అక్కడ 150 మంది ఉన్నట్లు స్థానికులు చెప్పారు. యంత్రాల సాయంతో ఆ ప్రాంతాన్నంతా తవ్వుతూ అందులో చిక్కుకుపోయిన వారి కోసం సహాయబృందాలు అన్వేషిస్తున్నాయి.
దాదాపుగా స్థానికులంతా కూడా తెల్లారింది మొదలు ఆ చెత్తలో అదేపనిగా వెతికి పనికిరాకుండా పడేసిన డబ్బాలు, సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు ఇతరాలను పోగుచేసి ఆ వ్యర్థాలను అమ్ముకుని పొట్టపోసుకునే వారే. రోజుకు కనీసం అయిదువందల మంది ఈ పనిలో నిమగ్నమై ఉంటారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా శివారుల్లోని కోషే వద్ద ఉన్న చెత్తయార్డులో గత యాభయ్యేళ్ల నుంచి పోగవుతున్న చెత్త పెద్ద కొండల వరసలా పేరుకుంది. సుమారు నలభైలక్షల మంది జనాభా ఉన్న అడిస్ అబాబాలోని చెత్తాచెదారం అంతా శివారులోని కోషేకు చేరుతుంది.
ఏటా కనీసం మూడులక్షల టన్నుల చెత్త ఇక్కడ పోగవుతుందని అంచనా. అయితే, గుప్పెడు మెతుకులకు నోచుకోని నిరుపేదలు చాలా మంది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోనే చెత్తకుప్పలను ఆనుకునే చెక్కలు, కర్రలు, మట్టితో చిన్నచిన్న గుడిసెల్లాంటివి నివసిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడి పేదపిల్లలు ఆచెత్తలో వెతుక్కుని దొరికిన తిండే తింటున్నారన్న వార్తలు వెల్లువెత్తాయి.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







