ఉద్రిక్తత నెదర్లాండ్‌ దౌత్య కార్యాలయం వద్ద

- March 12, 2017 , by Maagulf
ఉద్రిక్తత నెదర్లాండ్‌ దౌత్య కార్యాలయం వద్ద

- డచ్‌ పతాకాన్ని తొలగించిన నిరసనకారులు 
 టర్కీ ఇస్తాంబుల్‌ నగరంలోని నెదర్లాండ్‌ దౌత్య కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నిరసనకారులు డచ్‌ పతాకాన్ని తొలగించి, దాని స్థానంలో టర్కీ పతాకాన్ని ఎగురవేశారు. దీంతో, ఆ ప్రాంతంలో ఘర్ణణ వాతావరణం చోటుచేసుకున్నది. పోలీసులు, భద్రతా బలగాలు దౌత్య కార్యాలయ పరిసర ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయి. పోలీసులు ఆందోళనకారులపై భాష్ప వాయుగోళాలు ప్రదర్శించారు. భద్రతా కారణాల దృష్ట్యా నెదర్లాండ్‌ ఎంబసీని తాత్కాలికంగా మూసివేసినట్టు టర్కీ అధికారులు ప్రకటించారు.

నెదర్లాండ్‌ దౌత్య కార్యాలయం వద్ద అల్లర్లు ? 
టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లత్‌ కవుసోగ్లూ నెదర్లాండ్‌ లో పర్యటించడాన్ని డచ్‌ అధికారులు అడ్డుకున్నారు. రా జ్యాంగ సవరణ రిఫరెండమ్‌పై ప్రవాస టర్కీ పౌరుల్లో అవ గాహన కల్పించేందుకు ఎర్డోగన్‌ మద్దతుదారులు గత కొం తకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు వారు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి సంఘీభావం తెలిపేందుకు నెదర్లాండ్‌కు వెళ్లిన టర్కీ ఆరోగ్య మంత్రి ఫత్మా బెతుల్‌ సయాన్‌ కయాకి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయ అధికారులు ఫత్మాను తిరిగి టర్కీకి పంపించారు. దీంతో, నిరసనకారుల్లో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. నెదర్లాండ్‌ అధికారుల తీరును విమర్శించారు. ఇస్తాంబుల్‌లోని నెదర్లాండ్‌ ఎంబసీ వద్దకు చేరుకుని ఆ దేశ పతాకాన్ని తొలగించారు. అయితే, టర్కీ పౌరులకు మద్దతుగా ఎర్డోగన్‌ నిలవడం గమనార్హం.
ఆదివారం స్థానిక మీడియాతో ఎర్డోగన్‌ మాట్లాడారు. ' నెదర్లాండ్‌లో నా మద్దతుదారులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన మంత్రులను ఆ దేశ ప్రభుత్వం బహిష్కరించింది. దీన్ని ఖండిస్తున్నాను. డచ్‌ అధికారులంతా నాజిజం, ఫాసిస్టు విధానాలనే అనుసరిస్తున్నారు. నా మద్దతుదారులకు సంఘీభావం తెలిపేందుకు నెదర్లాండ్‌లో పర్యటిస్తాను. అడ్డుకోవాలని ప్రయత్నిస్తే నెదర్లాండ్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ' అన్నారు. కాగా, ఎర్డోగన్‌ వ్యాఖ్యలను నెదర్లాండ్‌ ప్రధాని మార్క్‌ ర్యూట్‌ ఖండించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. 
ఏప్రిల్‌ 16న టర్కీ రాజ్యాంగ సవరణపై రిఫరెండమ్‌ 
టర్కీ రాజ్యాంగాన్ని సవరిం చాలని ఎర్డోగన్‌ యోచిస్తున్నారు. ప్రస్తుతమున్న పార్లమెంటరీ విధానాన్ని రద్దుచేసి దాని స్థానంలో అధ్యక్ష పాలనను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదననకు పార్లమెంట్‌ సభ్యులతో పాటు దేశ ప్రజల మద్దతు అవసరముంటుంది. జనవరి 20న జరిగిన సమావేశంలో మెజారిటీ పార్లమెంట్‌ సభ్యులు ( 550 మందిలో 339 మంది ఎంపీలు ) ఎర్డోగన్‌ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. ఎర్డోగన్‌ సర్కార్‌ వచ్చేనెల 16న రిఫరెండమ్‌ను ( ప్రజాభిప్రాయ సేకరణ ) ప్రవేశపెట్టి ప్రజల మద్దతును కోరనుంది. ఐరోపా కూటమి దేశాల్లో ప్రవాసముంటున్న టర్కీ పౌరుల నుంచి కూడా మద్దతు పొందాలని అధికార ఏకే పార్టీ ( జస్టిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ) శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. 
ఒకవేళ మెజారిటీ ప్రజలు అధ్యక్ష పాలనకు అనుకూలం గా ఓటింగ్‌ వేసినట్టయితే రాజ్యాంగ సవరణ జరుగుతుంది. తద్వారా ఎర్డోగన్‌కు విస్తృత అధికారాలు వస్తాయి. మంత్రుల తో పాటు న్యాయమూర్తులను నియమిం చే కార్యనిర్వాహక అధికారాలు దేశాధ్యక్షుడికి లభిస్తాయి. పార్లమెంట్‌ను రద్దు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులు ప్రకటించే అధికారాలు కూడా లభిస్తాయి. ప్రస్తుతమున్న 550 ఎంపీ సీట్లను 600కి పెంచుకునే వెసు లుబాటు ఉంటుంది. కాగా, ప్రధానికి ఉండే విస్తృత అధికారాలను తొలగించి అధ్యక్షుడికే అధికారాలను కట్టబెట్టాలనే ఎర్డోగన్‌ ప్రతిపాదనను అక్కడి ప్రతిపక్షమైన నేషనలిస్ట్‌ మూమెంట్స్‌ పార్టీ కూడా సమర్థిస్తుండటం గమనార్హం.
నెదర్లాండ్‌ను వెంటాడుతున్న 
అంతర్గత సమస్యలు : టర్కీ ప్రధాని 
'నెదర్లాండ్‌ దేశాన్ని ఎన్నో అంతర్గత సమస్యలు వెంటాడుతున్నాయి. ఈనెల 15న నెదర్లాండ్‌ పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫైర్‌బ్రాండ్‌ గీర్త్‌ వైల్డర్స్‌ నేతృ త్వంలోని యాంటీ ఇమ్మిగ్రేషన్‌ పార్టీ ఫర్‌ ఫ్రీడమ్‌కి విస్తృ త జనాధరణ లభిస్తున్నదని పలు సర్వేలు వెల్లడిస్తున్నా యి. దేశ ప్రధానికి వైల్డర్స్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయనలో ఓటమి భయం పట్టుకుంది. అందుకే, ఏం చేయాలో పాలుపోక ప్రవాస టర్కీ పౌరుల ఆందోళనలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు నెదర్లాండ్‌లోని తమ పౌరుల భావ వ్యక్తీకరణ, వాక్‌ స్వాతంత్య్రపు హక్కులకు భంగం వాటిల్లుతోంది' అని టర్కీ ప్రధాని బినాలీ ఇల్దిరిమ్‌ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com