పాకిస్తాన్ స్కూల్ విద్యార్ధులు లతా పాటను రోజూ ఆలపించే
- March 13, 2017
మన దేశం అంటే పాక్ విపరీతమైన ద్వేషం కురిపిస్తుంది.. కానీ ఆ ద్వేషం పాలకులకే గానీ ప్రజలకు లేదు అని మరో సారి రుజువైంది.. ఓ బాలీవుడ్ సినిమా పాట కు అరుదైన గౌరవం దక్కింది.. ఓ పాఠశాలలో ఆ పాటను రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. అంతకంటే ఓ సినిమాకు కావలసిన గౌరవం ఏముంటుంది.. ? అదీ కూడా ఆ పాఠశాల పాకిస్తాన్ లో ఉందంటే అంతకంటే విశేషం ఏముంది? ఆ గౌరవం దక్కించుకొన్న పాట.. "దో ఆంఖే బరహ్ హాథ్" చిత్రంలో లతామంగేష్కర్ పాడిన 'యే మాలిక్ తేరే బందే హమ్...' పాట.. 1957 లో వచ్చిన ఈ పాట అప్పటి ప్రేక్షకుల హృదయాల్లో మరపురాని గీతంగా నిలిచిపోయింది.. ఈ పాట లోని భావం నచ్చిన ఓ పాకిస్తానీ పాఠశాల నిర్వహకులకు ఆ పాటలోని భావం నచ్చి తమ పాఠశాల గీతంగా స్వీకరించి రోజూ విద్యార్ధులతో పాడిస్తున్నారు.. కాగా ‘దో ఆంఖే బారహ్ హాథ్’ చిత్రం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచిపోయింది. బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో సిల్వర్ బేర్ పురస్కారం తో పాటు.. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం (హిందీ) అవార్డ్స్ ను గెలుచుకొన్నది
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







