ఈ నెల 17 న 'మా అబ్బాయి'
- March 13, 2017
శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మా అబ్బాయి’. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగా ప్రకాష్ రావు నిర్మించారు. కుమార్ వట్టి దర్శక త్వంలో రూపొందిన ‘మా అబ్బాయి’ ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు చిత్ర విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడు తూ…’ ‘మా అబ్బాయి’ నా కెరీర్ లో ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమా. ఎక్కువ కథా విస్తృతి ఉన్న సినిమా. కథపై నమ్మకంతో నిర్మాత నా మార్కెట్ కంటే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టారు. కొత్త కథ కాకున్నా…ఇప్పటివరకు రాని కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో సాగుతుంటుంది. ప్రయోగాత్మక సినిమా కాదు.. రెగ్యులర్ కమర్షియల్ మూవీనే. అయితే ప్రేక్షకు లకు భిన్నమైన అనుభూతినిస్తుంది.
మా అబ్బాయి అనే మాట ఎంత సహజంగా ఉంటుందో…ఈ చిత్రంలో నా పాత్ర కూడా అలాగే ఉంటుంది. ఆత్మవిశ్వాసం గల యువకుడు, అందరితో కలిసిపోయి ఉంటాడు. తన కుటుంబానికి వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించుకున్నా డనేది కథలో చూపిస్తున్నాం. యాక్షన్ ఎక్కువగానే ఉంటుంది.
రెండు మూడేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు సినిమా తెరకెక్కించారు. ఓ చిన్న సందేశం ఉంటుంది. దర్శకుడు నాకు చాలా కాలంగా తెలుసు. సినిమాను బాగా రూపొందించాడు.
‘మా అబ్బాయి’ చూశాక అంతా దర్శకుడి గురించే మాట్లాడుకుంటారు. నిర్మాత నిర్మాణ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రస్తుతం ‘మెంటల్ మదిలో’, ‘నీది నాదీ ఒకే కథ’ చిత్రాల్లో నటిస్తున్నాను. మరిన్ని పెద్ద ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయి.’ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







