జిటెక్స్‌ షాపింగ్‌ హంగామా అతి త్వరలో

- March 13, 2017 , by Maagulf

జిటెక్స్‌ షాపింగ్‌ హంగామా ఔత్సాహికుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తనుంది. అద్భుతమైన షాపింగ్‌ అనుభూతికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవనుంది జిటెక్స్‌ షాపింగ్‌. జిటెక్స్‌ షాపర్‌ స్ప్రింగ్‌ 2017 మార్చ్‌ 29 నుంచి ఏప్రిల్‌ వరకు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అత్యద్భుతమైన షాపింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని పొందేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. జిటెక్స్‌ సాపర్‌ టిక్కెట్లు 25 అరబ్‌ ఎమిరేట్‌ దినార్స్‌గా నిర్ణయించారు. జిటెక్స్‌ షాపర్‌ దుబాయ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ వద్ద కూడా టిక్కెట్లు లభ్యమవుతాయి. ఐదేళ్ళ లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీ పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ ఈ జిటెక్స్‌ షాపర్‌ స్ప్రింగ్‌లో ప్రధాన ఆకర్షణ. అదీ ఇదీ అన్నీ అనే స్థాయిలో జిటెక్స్‌లో కొనుగోలుకి అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం, టిక్కెట్లను బుక్‌ చేసుకుని జిటెక్స్‌ షాపింగ్‌ మజాని ఎంజాయ్‌ చెయ్యండిక. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com