పూర్తైన భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు

- March 13, 2017 , by Maagulf
పూర్తైన భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు

ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన తెదేపా నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు ఈ సాయంత్రం పూర్తయ్యాయి. ఆళ్లగడ్డలోని భూమా నివాసం నుంచి శోభాఘాట్‌ వరకు వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య భూమా భౌతికకాయానికి అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com