ఎఫ్‌బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఇండియన్
- April 19, 2017
ఎఫ్‌బీఐ టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో 26 ఏళ్ల ప్రవాసభారతీయుడిని చేర్చింది. ఆ క్రిమినల్ గుజరాత్‌కి చెందిన భ్రదేశ్‌కుమార్. కుమార్ భార్య పలక్‌తో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ స్థానిక రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. 2015 ఏప్రిల్‌లో భద్రేశ్ భార్యతో గొడవపడి రెస్టారెంట్‌లోని వంటగదిలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపి పరారయ్యాడు. ఇప్పటి వరకు కుమార్ ఆచూకీ దొరకలేదు. దాంతో ఎఫ్‌బీఐ ఇతన్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. ఇతన్ని పట్టిస్తే లక్ష డాలర్ల రివార్డ్ కూడా ప్రకటించింది. .
కుమార్‌ని పట్టుకుని అరెస్ట్ చేసేంతవరకు కేసు వదిలిపెట్టమని ఇందుకుప్రజలు కూడా సహకరిస్తే పని తేలికవుతుందని ఎఫ్‌బీఐ అధికారి జాన్సన్ మీడియాకు చెప్పారు. భద్రేశ్ వీసా గడువు ఇప్పటికే ముగిసిపోయి ఉంటుందని అతను అమెరికా వదిలి వెళ్లే అవకాశం కూడా లేదని చెప్పారు. భద్రేశ్ భార్య పలక్ తిరిగి ఇండియా వెళ్లిపోదామని చెప్పేదని ఈ విషయంలోనే అతను గొడవపడి ఆమెను హతమార్చుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







