డా. వంసిధర్ గుడిచుట్టు తో ముఖాముఖి

డా. వంసిధర్ గుడిచుట్టు తో ముఖాముఖి

1.    చిన్నపిల్లల్లో తరచూ తలెత్తే ఆరోగ్య సమస్యలెలా వుంటాయి?
చిన్న పిల్లల్లో తరచుగా మనం జ్వరం, జలుబు, వంతులు ఇంకా కడుపు నొప్పితో కూడిన లేదా లేకున్నా డయేరియా వంటి ఆరోగ్య సమస్యలను గమనించవచ్చు. వయస్సు మరియు తీవ్రతను బట్టి చిన్నారులలో వివిధ రకాలుగా ఈ సమస్యలు తల ఎత్తవచ్చు.

2.    పిల్లల్ని వేధించే సమస్యలో ముఖ్యమైనది డయేరియా, దాన్నుంచి పిల్లల్ని రక్షించుకోవడమెలా?
ఆహరం తినే ముందు, తరువాత చేతులను సుభ్రపరచుకోవడం, పరిశుభ్రమైన పాత్రలలో ఆహారాన్ని వండడం, తాజా  ఐన వేడివేడి ఆహారాన్ని భుజించడం, సూచించబడిన పద్ధతులలో ఆహారాన్ని నిల్వ చేయడం వంటి నిరోధక చర్యల ద్వారా ఈ దఎరియాను రాకుండా జాగ్రత్త పడవచ్చు. అపరిశుభ్రమైన నీరు ఈ వ్యాధికి మరో ముఖ్య కారణం కావడం వలన, దానిని కాచి చల్లార్చి లేదా ప్రభావవంతమైన ఫిల్టర్ ను వాడాలి. ఇంకా రోటో వైరస్ మరియు టైఫాయిడ్ వాక్సిన్ ల వంటివి చిన్నారులకు ఇప్పించడం మంచిది.

3.    చిన్న పిల్లల్లో తలెత్తే మలబద్ధకాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ రోజుల్లో మలబద్ధకం అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల ఆహారంలో తగినంత  నీరు మరియు పీచు పదార్ధాలు ఉండేలా పిల్లలకు మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడమే దీనికి పరిష్కారం. 2-10 సంవత్సరాల వయసు గల పిల్లలకు 15-20 గ్రాములు, 10-18 సామ్..20-30 గ్రాములు ఇక ఫైబర్ విషయానికి వస్తే రోజుకు ఫైబర్ అవసరం. ఓట్స్, బార్లీ, రై, అరటి,ఆపిల్, కేరట్, బంగాళా దుంప వంటి వాటిలో పీచు పదార్ధాలు ఉంటాయి. హోల్ మీల్ బ్రెడ్, తృణ ధాన్యాలు, మరియు నట్స్ మొదలైన కరగని పీచుపదార్ధాలు (అంటే ఇవి అరగావు) అరుగుదల సమస్యలను నివారిస్తాయి. ఇక ఎంత నీటిని తీసుకోవాలి అనేది క్లిష్టమైన ప్రశ్న; శరీర ధర్మాన్ని బట్టి, అవసరాన్ని బట్టి  వారు రోజుకు 6-8 గ్లాసుల ద్రవ పదార్ధాలను (నీరు, పళ్ళ రసాలు, సూప్, పాలు మొదలైనవి) తీసుకుంటే సరిపోతుంది.

4.    గల్ఫ్దేశాల్లో వుండే విభిన్నమైన వాతావరణం నుంచి పిల్లల్ని సంరక్షించుకోవడానికి మీరిచ్చే సూచనలు సలహాలు?
గల్ఫ్ దేశాల్లో వాతావరణంసాధారణంగా సంవత్సరం పొడవునా అతి వేడిగా,  ఇంకా కొన్ని సార్లు ఇసుక తుఫానులతో కూడి ఉంటుంది. అందువల్ల వేడి తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు నీడ గల ప్రదేశాల్లో లేదా ఇంటి లోపల ఉండడం శ్రేయస్కరం. ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండడం ఇంకో అతిముఖ్యమైన విషయం. అదేసమయంలో శరీరాన్ని తేమగా ఉంచడంలో కూల్ డ్రింకులు ఏ మాత్రం ఉపయోగపడవు కనుక, వాటిని నివారించాలి. ఇక,ఇసుక తుఫానులు వంటివి సంభవించినపుడు ఊపిరికి సంబంధించిన సమస్యలను నివారించడానికి ఇంటిలోపలె ఉండడం చాలా అవసరం.

5.    శ్వాసకోస సమస్యలు పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఆ సమస్యలకు వైద్య చికిత్స ఏమిటి?
ఈ ప్రాంతంలో వివిధ కారణాల వలన అధిక సంఖ్యలో పిల్లలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఇప్పటికే అలెర్జీ లేదా  ఆస్మా వంటి వ్యాధులు  ఉన్న పిల్లల్లో ఈ సమస్యలు మరింత ఎక్కువౌటు తు ఉంటాయి. అనవసర ఇబ్బందులను నివారించడానికి,  మీ పిల్లలలో ఎవైన ఊపిరి సంబంధమైన చిన్న చిన్న సమస్యలను గమనించి నట్లయితే,  పిల్లల వైద్య నిపుణులను కలవడం మంచిదని నా సలహా; ఒకొక్క  చిన్నారికి  చికిత్స విధానం  మారుతూ  ఉంటుంది. అందువలన  సీత కాలంలో ఇబ్బంది పెట్టే మరో సాధారణ శ్వాస కోశ సంబంధ వ్యాధి - వైరల్ ఇన్ఫెక్షన్. శరీరానికి తగినంత ద్రవ పదార్ధాలను అందించడం ద్వారా , పారాసెటమాల్ ఔషధాన్ని ఇవ్వడం ద్వారా మీ చిన్నారికి ఈ సమస్యను సత్వరంగా తగ్గించవచ్చు. ఐతే స్వంత వైద్యం కాకుండా పిల్లల వైద్య  నిపుణుని కలవడం మాత్రం ఎప్పుడూ మరచిపోకూడదు.

6.    రాత్రి పూట పక్క తడిపే పిల్లలకు ఆ అలవాటు మాన్పించడమెలా?
ఐదు సంవత్సరాలకంటే తక్కువ వయసు గలపిల్లలలో తత్రిపుట పక్క తడపడం అనేది చాలా సాధారణ విషయం; ఐతే, ఆ తరువాత కూడా ఈ అలవాటు కొనసాగినట్లైతే -ఆరోగ్యకరమైన ఆహారం, కేఫెన్ కలిగిన పదార్ధాలను (కాఫీ, టీ, కోలా వంటివి) రాత్రి  పూట తెసుకోకుండా ఉండడం, పగటిపూట తగినంతగా నీటిని తాగడం, నిద్రపోబోయే ముందు ఒకటికి వెళ్ళడం,  మీ చిన్నారి రాత్రి మధ్యలో నిద్ర లేచినట్లయితే మల్లి నిద్ర పోబోయే ముందు టాయిలెట్ కి వెళ్ళమని ప్రోత్సహించడం, లేదా మీరే తీసుకెళ్లడం; తను సాధారణంగా పక్క తడిపే సమయాని కంటే 30 నిముషాలు ముందుగా మేలుకొలిపే 'బెడ్ వేట్టింగ్ అలారం' కూడా పనిచేయవచ్చు. రాత్రి పూట పక్క తడపనపుడు, తనను మెచ్చుకొని ప్రోత్సహించడం మంచిది. అదేవిధంగా పక్క తడిపినందుకు తనను తితాదం, అవమానించడం వంటి వాటి వల్ల పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. ఇక, తల్లిదండ్రులు ఇంకా తమ పిల్లల గురించి మధన పడుతున్నట్టైతే, వారు సలహాలు, పరీక్షలకు మరియు అనంతర నిర్వహణ కొరకు పిల్లల వైద్య నిపుణులను సందర్శించవచ్చు.

7.    ఏ కాలంలో ఎలాంటి ఆహారం చిన్నారులకు మేలు?
మనం మన ఇంటిలో తాయారు చేసే ఆరోగ్యకరమైన ఆహారమే పిల్లలకు అన్ని కాలాలలో మంచిది. అవే కాకుండా, వేసవి కాలంలో మిల్క్ షేక్స్ మరియు ఫ్రూట్ స్క్వాష్ వంటి రూపాలలో ద్రవ పదార్ధాలను; సీతా కాలంలో గుడ్లు, నట్స్ మరియు సూప్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనాలను పొందవచ్చు.

 

డా. వంసిధర్ గుడిచుట్టు 
పీడియట్రిసియన్,
లైఫ్ లైన్ మెడికల్ సెంటర్,బర్ దుబాయ్

Back to Top