ఇండియాలో బహ్రెయిన్ జాతీయుల అరెస్ట్
- November 11, 2017
హైదరాబాద్: ఇండియాలోని హైదరాబాద్‌లో పోలీసులు, ఇద్దరు బహ్రెయినీ జాతీయుల్ని అలాగే ఓ ఖాజీని అరెస్ట్ చేశారు. అక్రమంగా బాల్య వివాహాల్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న కారణంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. నిందితులు మొహమ్మద్ మొహమూద్ అబ్దుల్ రహ్మాన్ మొహమూద్, యూసుఫ్ మొహమూద్ అబ్దుల్ రహమ్మాన్ మొహమూద్ ఖైరి బహ్రెయిన్ జాతీయులు కాగా, హైదారాబాద్‌కి చెంది కాజీ అక్సర్ అలి రఫాయ్ ఉన్నారు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్లో గత ఆగస్ట్‌లో రిజిస్టర్ అయిన కేసు విచారణలో భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు. ఈ తరహా షేక్ పెళ్ళిళ్ళపై పోలీసులు ప్రత్యేకమైన దృష్టిపెట్టడంతో ఇటీవల పలువురు ఖాజీలు, అరబ్ దేశాలకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







