జోస్యంతో పాక్ ను హడలెత్తిస్తున్న భారతీయుడు

- December 05, 2017 , by Maagulf
జోస్యంతో పాక్ ను హడలెత్తిస్తున్న భారతీయుడు

దిల్లీ: పాకిస్థాన్‌లో ఫలానా సమయంలో దాడులు జరుగుతాయంటూ ఓ జ్యోతిష్కుడు చేసిన ట్వీట్‌లకు.. ఆ దేశ ఎంపీలు బెంబేలెత్తుతున్నారు. ఇదే సాకుగా తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్‌ హస్తముందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనిరుధ్‌కుమార్‌ మిశ్ర అనే పేరుతో ఓ వ్యక్తి ట్విటర్‌లో జోస్యాలు చెబుతున్నారు. విపత్తులు, ఎన్నికలు, స్టాక్‌మార్కెట్‌లు, ఉగ్రదాడులు సహా వివిధ అంశాలకు సంబంధించిన పరిణామాలపై ముందుగానే అంచనాలు వేస్తున్నారు. నవంబర్‌లో పాక్‌లో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ అక్టోబర్‌లోనే ఆయన ట్వీట్‌చేశారు. అయితే డిసెంబర్‌ 1న పెషావర్‌లో ఉగ్రవాదులు దాడి చేసి 13మందిని బలితీసుకున్నారు. దీంతో ఘటనపై ఓ భారతీయుడు అటూఇటుగా అంచనా వేయగలిగాడని.. ఇదెలా సాధ్యమైందని పాక్‌ అంతర్గతమంత్రిని ఆ దేశ ఎంపీలు వివరణ కోరారు. ఇటు ఫిబ్రవరి ముగిసేలోపు పాక్‌లో ఐదు దాడులు జరుగుతాయంటూ అనిరుధ్‌కుమార్‌ ఇంకో ట్వీట్‌చేయడం గమనార్హం. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com