ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్క వివాహాలు చట్టబద్ధం

- December 07, 2017 , by Maagulf
ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్క వివాహాలు చట్టబద్ధం

కాన్‌బెర్రా: స్వలింగ సంపర్క వివాహా బిల్లును ఆస్ట్రేలియా పార్లమెంట్‌ గురువారం ఆమోదించింది. సాంప్రదాయ పద్ధతిలో ఒక పురుషునికి, మహిళకు మధ్య జరిగే వివాహ నిర్వచనాన్ని ఇద్దరు వ్యక్తుల కలయికగా మార్చడానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించడంతో ప్రతినిధుల సభలో పబ్లిక్‌ గ్యాలరీ హర్షధ్వానాలతో మార్మోగింది. ఈ మార్పును గట్టిగా సమర్ధిస్తున్నట్లు నవంబరులో నిర్వహించిన సర్వేలో కూడా వెల్లడైంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కేవలం ఐదుగురు పార్లమెంట్‌ సభ్యులే ఓటు చేశారు. గత వారం సెనెట్‌లో కూడా ఈ బిల్లు ఆమోద ముద్ర పొందింది. బిల్లుకు అనుకూలంగా 43ఓట్లు రాగా వ్యతిరేకంగా 12ఓట్లు లభించాయి. రాచరికపు ఆమోద ముద్ర, ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత నెలరోజుల్లో ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది. అంటే నెల రోజుల తర్వాత స్వలింగ సంపర్క వివాహాలు జరుగుతాయని భావిస్తున్నారు. గే వివాహాలను వ్యతిరేకించే వారి భావ ప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఉద్దేశించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. వీటిని తర్వాత దశలో పరిశీలించే అవకాశం వుంది.

ఆస్ట్రేలియాలో గే వివాహాలు కార్యరూపం దాల్చిన తర్వాత మతపరమైన స్వేచ్ఛను ఎలా కాపాడాలనే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. అయితే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొత్త వివక్షలేవీ కూడా తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా పార్లమెంట్‌ సభ్యులుగా తమపై వుందని పాలక పక్ష సభ్యుడు వారెన్‌ ఎన్‌టాక్‌ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు రూపకల్పనకు దోహదపడిన ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ సమానత్వం, మత స్వేచ్ఛల మధ్య సరైన సమతూకం వుండేలా ఈ బిల్లును తీసుకువచ్చిట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com