వైట్‌ వెపన్స్‌: 30,000 దిర్హామ్‌ల జరీమానా

- December 07, 2017 , by Maagulf
వైట్‌ వెపన్స్‌: 30,000 దిర్హామ్‌ల జరీమానా

దుబాయ్‌ పోలీసులు, ఎమిరేట్‌ రెసిడెంట్స్‌కి వైట్‌ వెపన్స్‌ విషయమై హెచ్చరికలు జారీ చేశారు. కత్తులు, స్వార్డ్స్‌, బాటన్స్‌ వంటి వైట్‌ వెపన్స్‌ని తమతోపాటు తీసుకెళ్ళడం నేరమని దుబాయ్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. హెచ్చరికల్ని బేఖాతరు చేస్తే ఒకటి నుంచి మూడు నెలల వరకు జైలు శిక్ష అలాగే 5,000 నుంచి 30,000 దిర్హామ్‌ల వరకు జరీమానా తప్పదని ఓలీసులు పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ పేజీలో ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు పోలీసులు. స్టేడియంలలోకి ఈ తరహా ఆయుధాల్ని తీసుకెళుతున్న వ్యక్తులకు సంబంధించిన ఫుటేజ్‌ ఆ వీడియోలో ప్రస్తావించారు. డిసెంబర్‌ 6 నుంచి 16 వరకు జరిగే ఫిఫా వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో నిబంధనల్ని మరింత కఠినతరం చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com