రివ్యూ : ఒక్క క్షణం

- December 28, 2017 , by Maagulf
రివ్యూ : ఒక్క క్షణం

టిల్ : 'ఒక్క క్షణం ' (2017) 
స్టార్ కాస్ట్ : అల్లు శిరీష్, సురభి, శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్‌ తదితరులు.
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాతలు: చక్రి చిగురు పాటి
మ్యూజిక్ : మణిశర్మ
విడుదల తేది : డిసెంబర్ 28, 2017 
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ఒక్క క్షణం - ఆకట్టుకునే కాన్సెప్ట్..

శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంటగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బస్టర్ అందించిన చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి నిర్మించిన చిత్రం ఒక్క క్షణం. శ్రీనివాస్ అవసరాల, సీరత్ కపూర్ జంటగా కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్స్ కొత్తగా ఉండడం , సస్పన్స్ గా ఉండడం తో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది..మరి వారి ఆసక్తి ని ఏ మేరకు తీర్చిందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

జీవ (అల్లు శిరీష్) ఇంజనీరింగ్ పూర్తి చేసి, సరదాగా కాలాన్ని గడుపుతుంటాడు.ఇదే సమయం లో జ్యోత్స్న (సురభి) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఇద్దరు ప్రేమలో పడతారు. వీరి ప్రేమకు ఇద్దరి తల్లిదండ్రులు ఒకే చెపుతారు..జ్యోత్స్న ఇంటిపక్కనే ఉండే స్వాతి (సీరత్) , శ్రీనివాస్ (అవసరాల శ్రీనివాస్) వారి మధ్య ఏదో జరుగుతుందని జ్యోత్స్న , జీవా కు చెపుతుంది. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇద్దరు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఈ క్రమం లో కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. శ్రీనివాస్, స్వాతిల జీవితంలో ఏ సంఘటనలు అయితే జరిగాయో అవే సంఘటనలు జీవా, జ్యోత్స్నల జీవితంలో ప్రస్తుత కాలంలో జరుగుతుంటాయి. అదే సమయం లో స్వాతి హత్య కు గురి అవుతుంది..దీంతో జ్యోత్స్న లో కూడా భయం పట్టుకుంటుంది..తాను కూడా ఇలాగే చనిపోతుందని భయపడుతుంది..ఇంతకీ స్వాతిని ఎవరు చంపారు..? స్వాతి కి శ్రీనివాస్ కు మధ్య ఏం జరిగేది..? జ్యోత్స్న ను జీవ ఎలా కాపాడుకుంటాడు..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ

* ఇంటర్వెల్ ట్విస్ట్

* క్లైమాక్స్

మైనస్ :

* అల్లు శిరీష్

* మ్యూజిక్

* ఫస్ట్ హాఫ్

నటీనటుల పెర్పామెన్స్ :

* అవసరాల శ్రీనివాస్ , సీరత్ కపూర్ ల నటన బాగుంది.. సీరత్ కు ఈ మూవీ లో మంచి పాత్ర దక్కిందనే చెప్పాలి..ఇక గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక సురభి కూడా తన పరిధిలో బాగానే చేసింది.

* అల్లు శిరీష్ నటనలో పెద్దగా మార్పులేవీ కనిపించలేదు..ఎమోషనల్ సీన్స్ లో మాత్రం శిరీష్ నటన తేలిపోయింది. ఇక డాన్స్ లు , రొమాంటిక్ సన్నివేశాల్లో ఏదో ఓ మాదిరిగా చేసాడు అంతే. ఇలాంటి కథ లో శర్వానంద్ , నాని లాంటి హీరోలైతే ఇంకాస్త బాగుండేది.

* కాశి విశ్వనాథ్, రోహిణి, జయప్రకాష్‌, ప్రవీణ్‌, సత్య, సుదర్శన్‌, వైవా హర్ష, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, బిల్లి మురళి, రవి వర్మ, శ్రీసుధ, చిత్రం భాషా, భిందు, ప్రణవ్‌, బద్రం తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* మణిశర్మ మరోసారి ఆకట్టుకోలేకపోయాడు. ఒక్క సాంగ్ కూడా బాగాలేదని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమిలేదు. అక్కడక్కడా ఓకే అనిపించాడు అంతే.

* ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాల నెమ్మదిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో కాస్త స్పీడ్ చేసాడు. అయినాగానీ అక్కడక్కడా నెమ్మదిగానే సాగుతుందని అనిపిస్తుంది.

* అబ్బూరి రవి డైలాగ్స్ పర్వాలేదు అనిపించాయి. శ్యామ్ కె నాయుడు సినిమా ఫోటోగ్రఫి ఆకట్టుకుంది.

* చక్రి చిగురు పాటి నిర్మాణ విలువలు బాగున్నాయి..

* స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విషయానికి వస్తే వస్తే ..ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం లో సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగాయి. అది కాక ట్రైలర్ లో సైతం కథ కొత్తగా ఆసక్తి గా ఉందని అనిపించడం తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. వారి అంచనాలను అందుకోవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంతవరకు తెలుగు లో రానంటువంటి కథ తో వచ్చాడు. ఈ కథ రెండు పార్లల్ లైఫ్ లతో ముడిపడి వుంటుంది. ఒకరి ప్రెజెంట్ మరోకరి ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ తో వి ఐ ఆనంద్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు.

ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వేరు వేరు సమయాల్లో జరిగే సంఘటలను ఎక్కడ ప్రేక్షకుడికి కన్ఫ్యూజన్ కలగకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. కాకపోతే కథలోనే ఇంకాస్త మలుపులు ఉంటె బాగుండు. మ్యూజిక్ విషయం లో కూడా శ్రద్ద పెట్టినట్లయితే ప్రేక్షకుడు హ్యాపీ గా ఫీల్ అయ్యేవారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో స్పీడ్ పెంచితే సినిమా ఇంకాస్త బాగుండేది.

చివరిగా :

ఇప్పటివరకు తెలుగు లో రానటువంటి కథ ఇది..ఈ చిత్రం రెండు పార్లల్ లైఫ్ లతో ముడిపడి వుంటుంది. ఒకరి ప్రెజెంట్ మరోకరి ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ తో కథ సాగుతుంటుంది. మ్యూజిక్ నిరాశ పరిచిన..ఇంటర్వెల్ ట్విస్ట్ , క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అనేది కాస్త ఇంట్రస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా కొత్త తరహా కథలను ఇష్టపడే వారికీ ఈ మూవీ బాగా నచ్చుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com