4 ఎన్‌.ఎస్‌.ఎస్‌ అవార్డులు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం

- January 02, 2018 , by Maagulf
4 ఎన్‌.ఎస్‌.ఎస్‌ అవార్డులు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం

హైదరాబాద్‌:జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌.) విభాగంలో కేంద్రం అందించిన అత్యున్నత అవార్డులు అందుకున్న తెలంగాణ వాలంటీర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మంగళవారం అభినందించారు. 2016-17 సంవత్సరానికి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అందించిన ఎన్‌.ఎస్‌.ఎస్‌. అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు దక్కించుకుంది. ఉత్తమ యూనిట్‌ అవార్డు మేడ్చల్‌ జిల్లా ఘట్‌ కేసర్‌ కు చెందిన అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ కు, ఉత్తమ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ అవార్డు అనురాగ్‌ గ్రూప్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ సి.మల్లేశ్‌, ఉత్తమ వాలంటీర్లుగా ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీకి చెందిన తగరపు నవీన్‌, జె.ఎన్‌.టి.యు(హెచ్‌)కు చెందిన పటుకూరి లలిత్‌ ఆదిత్య గత నెలలో అందుకున్నారు. వీరిని సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.ఎస్‌.ఎస్‌. రాష్ట్ర మాజీ లైజనింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com