మళ్లీ పెరిగిన బంగారం ధర..!

- January 02, 2018 , by Maagulf
మళ్లీ పెరిగిన బంగారం ధర..!

అమెరికా- ఉత్తర కొరియా ఉద్రిక్త పరిస్థితులతోపాటు, అమెరికా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో డాలర్‌ బలహీనత అంచనాలు ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్‌ పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో 2017లో దాదాపు 150 డాలర్లు ఎగసింది.

ఒకదశలో 200 డాలర్ల పెరుగుదలనూ నమోదుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అధికంగా ఉండడంతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఈ మధ్య కొన్ని రోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ రోజు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 పెరిగి 30, 450గా నమోదైంది. సింగపూర్‌ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లుగా నమోదైంది. కాగా, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడంతో కిలో వెండి ధర రూ.390 తగ్గి 39,710గా నమోదైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com