సిగరెట్ సేల్స్‌ని తగ్గించిన ఎక్సయిజ్ ట్యాక్స్
- January 05, 2018
మనామా: స్మోకింగ్ అనే దురలవాటుని తగ్గించే క్రమంలో సిగరెట్ ఉత్పత్తులపై గణనీయంగా ట్యాక్స్‌ని పెంచడంతో ఆ ప్రయోగం కొంతమేర సత్ఫలితాలను ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఎక్సయిజ్ ట్యాక్స్ అమలుతో సిగరెట్స్ కొనేవారి సంఖ్య తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. అలాగే కార్బొనేటెడ్ డ్రింక్స్‌పైనా ఎక్సయిజ్ పన్ను తీవ్ర ప్రభావమే చూపుతోంది. ట్యాక్స్ పెరగడంతో తాను స్మోకింగ్‌ని మానేసుకోవాల్సి వచ్చిందనీ, అంత పెద్ద మొత్తంలో తాను సిగరెట్ కోసం ఖర్చు చేయలేనని బంగ్లాదేశీ జాతీయుడు మొహమ్మద్ ఇస్లామ్ చెబుతూ, ఈ నిర్ణయం మంచిదేనని తెలిపారు. తక్కువ జీతంతో పనిచేస్తూ, స్మోకింగ్ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి రావడం కష్టంగా ఉందని, అందుకే స్మోకింగ్ మానేస్తున్నట్లు ఇంకొకరు చెప్పారు. అయితే కొందరు మాత్రం సిగరెట్ స్మోకింగ్ వ్యసనాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రోజూ 2 నుంచి 3 ప్యాకెట్ల సిగరెట్లను కాల్చేవారు ఇప్పుడు ఒక్క ప్యాకెట్‌కే పరిమితమవ్వాల్సి వస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి