రోడ్‌ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌

- January 19, 2018 , by Maagulf
రోడ్‌ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌

మనామా: కోకా కోలా బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018, రోడ్‌ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్‌ నిర్వహించే రోడ్‌ షోతో ఈ టీ20 క్రికెట్‌ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్‌, 13 రెసిడెంట్‌ క్రికెటర్స్‌ ఈ ఫార్మాట్‌లో పోటీ పడుతున్నారు. డాన్స్‌, రోడ్‌ షో, ఇతర ప్రమోషనల్‌ ఈవెంట్స్‌తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్‌. మొత్తం 35 మంది బైకర్స్‌ రోడ్‌ షోలో పాల్గొన్నారు. హిద్‌, జుఫైర్‌, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్‌ షో జరిగింది. బహ్రెయిన్‌ మాల్‌ వద్ద పలు ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ జరిగాయి. కెహెచ్‌కె స్పోర్ట్స్‌ సిఇఓ మొహమ్మద్‌ సాహిద్‌ అలాగే బిపిఎల్‌ ప్రెసిడెంట్‌ మన్సూర్‌ కోకాకోలా బహ్రెయిన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2018 లాంఛ్‌ ఆఫ్‌ టీమ్స్‌ చేపట్టారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com