అమెరికా ప్రభుత్వం మూతపడింది
- January 20, 2018
అమెరికా ప్రభుత్వం మరోసారి మూతపడింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును అమెరికన్ సెనెట్ ఆమోదించక పోవడంతో షట్డౌన్ షురూ అయ్యింది. గడువు ముగిసే లోపు.. వినిమయ బిల్లును సెనెట్ ఆమోదం పొందలేకపోయింది. బిల్లును ఎలాగైనా ఆమోదించుకోవాలన్న ట్రంఫ్ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. డెమోక్రట్లు.. రిపబ్లికన్ల మధ్య చర్చలు విఫలమయ్యాయి.. దీంతో ఫిబ్రవరి 16 వరకు షట్డౌన్ కొనసాగనుంది..
అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అవ్వడం ఇదే తొలిసారి కాదు.. 1981 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఇలా మూతపడింది.. 2013లో 16 రోజుల పాటు.. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి.. మరోసారి అత్యవసర ఖర్చులు మినహా మిగతా ప్రభుత్వ కార్యకలాపాలకు ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. రిపబ్లికన్ల మద్దతు పూర్తిగా ఉన్న ప్రతినిధుల సభ ఇప్పటికే బిల్లును 230–197 తేడాతో ఆమోదించింది. అయితే స్థానికుల భద్రతకు ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో బిల్లును డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించింది. కొంతమంది రిపబ్లికన్లు కూడా వారికి మద్దతు పలకడంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేకపోయింది..
అవసరమైన నిధుల విడుదలను కాంగ్రెస్ తిరస్కరించడం వల్ల కొన్ని మినహా ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తిగా మూసివేశారు. అత్యవసర విభాగాలైన రక్షణ వ్యవహారాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ, ఎఫ్బీఐ వంటివి మాత్రం పని చేయనున్నాయి.. మిగిలినవాటిలో అధిక శాతం ప్రభుత్వ సర్వీసులు నిలిచిపోతాయి. ఈ షట్డౌన్ సమయంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవు ప్రకటిస్తారు...
తాజా షట్డౌన్ కారణంగా అమెరికా ప్రభుత్వానికి ఒక్కో వారానికి దాదాపు 42 వేల కోట్ల రూపాయల వరకు నష్టం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. బిల్ క్లింటన్ హయాంలో అత్యధికంగా 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి వరకూ 21 రోజులు షట్డౌన్ కొనసాగింది..
ప్రస్తుతం ఈ పరిస్థితుల నుంచి గట్టక్కాలంటే ట్రంప్ సర్కార్కు 51 మంది డెమోక్రట్ల మద్దతు అవసరం ఉంది.. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.. దీంతో ఎంత కాలం షట్డౌట్ కొనసాగుతుందో చూడాలి.. మరో 16 రోజుల్లో.. వినిమయ బిల్లులు మార్పులు చేసుకొని.. ఆమోందించుకోలేకపోతే ట్రంప్ ప్రభత్వం పడిపోయే ప్రమాదం ఉంటుంది. మరి దీనిపై ట్రంప్ ఎలా ముందుకె వెళ్తారో చూడాలి.. ప్రస్తుతం ట్రంప్ సర్కార్ ముందు ఉన్నది ఒక్కటే పరిష్కారం.. తాత్కాలిక చర్యలు చేపట్టి ప్రభుత్వ కార్యాలయాలను నడపాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..